Weight Loss: బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌కు వెళ్లడం, డైటింగ్ చేయడం, కఠినమైన వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు చిన్న మార్పులు కూడా పెద్ద తేడాను కలిగిస్తాయని మీకు తెలుసా? డైటింగ్ కు బదులుగా మీ అలవాట్లను మెరుగుపరుచుకుంటే, మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా బరువు తగ్గవచ్చు. మన లైఫ్ స్టైల్ లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మనం బరువు తగ్గుతాము. ఎలాంటి టిప్స్ పాటించడం ద్వారా డైటింగ్ లేకుండానే బరువును తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి:
డైటింగ్ అంటే ఎల్లప్పుడూ కేలరీలను లెక్కించడం లేదా ఆహారాన్ని పరిమితం చేయడం కాదు. మొదటి అలవాటు ఏంటంటే.. మీ ఆహారంలో సహజ ఆహారాలను చేర్చుకోవడం. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు , ప్రోటీన్లతో కూడిన ఆహారం మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అంతే కాకుండా ఇది మీ ఆకలిని నియంత్రించడంలో కూడా మీకు సహాయపడుతుంది. రెట్ మీట్‌కు బదులుగా, చికెన్, చేప లేదా పప్పుధాన్యాలు వంటి ప్రోటీన్లు ఉన్న పదార్థాలను తినండి.
క్రమం తప్పకుండా నీరు త్రాగండి:
ప్రతి రోజు శరీరానికి సరిపడా త్రాగే అలవాటు చేసుకోండి. నీరు మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలిని కూడా తగ్గిస్తుంది. కొన్నిసార్లు నీరు, ఆకలి మధ్య తేడాను గుర్తించడం కష్టంగా మారుతుంది. కానీ మీరు సరైన సమయంలో నీరు తాగితే, అది మీ కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది. ప్రతి భోజనానికి ముందు 1-2 గ్లాసుల నీరు త్రాగండి. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ సెట్ చేయండి:
నిద్ర కూడా బరువు తగ్గడానికి నేరుగా ఉపయోగపడుతుంది. నిద్ర లేకపోవడం జీవక్రియను ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఇది మీ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆకలి బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. ప్రతి రోజు రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించండి. నిద్రపోయే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించి, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం అలవాటు చేసుకోండి.
టీ, కాఫీ తాగడం:
టీ, కాఫీలను సరిగ్గా, పరిమిత పరిమాణంలో తీసుకుంటే, ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఈ రెండు విషయాలు మీ జీవక్రియను పెంచుతాయి. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో చక్కెర లేదా కృత్రిమ స్వీటెనర్లను తక్కువగా వాడండి. గ్రీన్ టీ లేదా బ్లాక్ కాఫీ తీసుకోండి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా టీలో చక్కెరను తినకండి.
Also Read: పుచ్చగింజలు తింటే.. ఆశ్చర్యకర లాభాలు !
రోజువారీ శారీరక శ్రమ:
వ్యాయామం కేవలం జిమ్‌కే పరిమితం కాదు. మీరు రోజువారీ పనుల ద్వారా శారీరక శ్రమను కూడా పెంచుకోవచ్చు. నడవడం, మెట్లు ఎక్కడం, యోగా లేదా చిన్న చిన్న ఇంటి పనులు కూడా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడతాయి. 20-30 నిమిషాల నడక కూడా మీ బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రోజుకు కనీసం 30 నిమిషాల శారీరక శ్రమ అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.