BigTV English

Game Changer : మెగా ఫ్యాన్స్ పునకాలు తెప్పించేన్యూస్.. బిగ్ అప్డేట్ వచ్చేస్తుంది..

Game Changer : మెగా ఫ్యాన్స్ పునకాలు తెప్పించేన్యూస్.. బిగ్ అప్డేట్ వచ్చేస్తుంది..

Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు.. ట్రిపుల్ ఆర్ తర్వాత భారీ అంచనాలతో రాబోతున్న ఈ మూవీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడిన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేసింది టీమ్.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను వదలబోతున్నారని ఓ వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది..


తమిళ మాస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే ధోరణిలో అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా శంకర్ లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ ను చాలా గొప్పగా చూపించబోతున్నాడు అంటూ కొంతమంది చెబుతుంటే మరి కొంత మంది మాత్రం రామ్ చరణ్ కెరియర్ లోని ఈ సినిమా ది బెస్ట్ సినిమాగా నిలుస్తుందని తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా మెగాఫ్యాన్స్ కు పునకాలు తెప్పించే న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 28 న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ పై అనౌన్స్ మెంట్ రాబోతుందని సమాచారం..

ఇక ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే.. రామ్ చరణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ రాబోతుందని తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి రామ్ చరణ్ లుక్ కూడా లీకైంది.. ఎన్ని లీకులు ఉన్న స్టోరీలో ప్రత్యేకత ఉందని శంకర్ అంటున్నారు.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. మరో హీరోయిన్ గా అంజలి నటిస్తుంది. ఈ నుంచి మూడు పాటలు రిలీజ్ కాగా, టీజర్, ట్రైలర్ పై విమర్శలు ఎదురయ్యాయి. అందుకే ఇప్పుడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ లో స్టోరీ రివీల్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ ట్రైలర్ లోనే సినిమాను చూడొచ్చునని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇక షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారని టాక్.. ఇక తాజాగా ఓ న్యూస్ కూడా వినిపిస్తుంది.. తెలుగు చిత్ర పరిశ్రమలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్ర డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. అమెరికాలో ప్రీ-రిలీజ్ వేడుక జరుపుకోనుంది. భారీగా నిర్వహిస్తున్న ఈవెంట్ న డల్లాస్ లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేలల్లో బుకింగ్స్ జరిగాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈవెంట్ కు అతిధిగా క్రియేటివిటీ డైరక్టర్ సుకుమార్ హాజరుకానున్నారు. ఈమేరకు దిల్ రాజు టీమ్ అఫిషియల్ గా ప్రకటించింది..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×