BigTV English

Bigg Boss 8 Analysis: ప్రేరణకు గెలుపు శాతం ఎంతంటే.?

Bigg Boss 8 Analysis: ప్రేరణకు గెలుపు శాతం ఎంతంటే.?

Bigg Boss 8 Analysis: ఇప్పటివరకు పూర్తయిన ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లోని టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. కానీ ఇప్పటివరకు తెలుగులో ఏ అమ్మాయి కూడా విన్నర్ అయ్యి బిగ్ బాస్ ట్రోఫీని సంపాదించుకోలేకపోయింది. ఇదే కారణంతో ప్రతీ సీజన్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వచ్చే అమ్మాయిలు తమను గెలిపించమని అడుగుతుంటారు. ఇప్పటివరకు తెలుగులో 7 సీజన్స్ పూర్తయిన ఒక్క అమ్మాయి కూడా విన్నర్‌గా నిలవలేదు. ఇప్పుడు ప్రేరణ వంతు వచ్చింది. తను కష్టపడి బిగ్ బాస్ సీజన్ 8లో టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలిచింది. మరి తను విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?


తలబడే తత్వం

అబ్బాయిలతో సమానంగా పోటీపడి టాస్కులు ఆడే అమ్మాయిలు చాలా తక్కువమంది ఉంటారు. టాస్కులు మొదలయిన తర్వాత ఏదో ఒక పాయింట్‌లో తాము ఆడలేమని వెనక్కి తగ్గేవారు కూడా ఉంటారు. కానీ ప్రేరణ అలాంటి అమ్మాయి కాదు. ప్రతీ గేమ్‌లో గెలవాలనే పట్టుదలతోనే బరిలోకి దిగుతుంది. తన పట్టుదలే బిగ్ బాస్ హౌస్‌లో తనకు పెద్ద ప్లస్ అయ్యింది. పైగా చాలావరకు టాస్కుల్లో తను గెలిచినా గెలవకపోయినా తను ఎలా ఆడింది అనేది మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేసింది. ఎవరైనా తనపై అనవసరమైన నిందలు వేస్తున్నప్పుడు నోరుమూసుకొని కూర్చోకుండా వారితో తను తలబడే పద్ధతి చాలామంది ప్రేక్షకులకు నచ్చింది. అందుకే తనకు ఓట్లు వేసి ఫైనల్స్ వరకు తీసుకొచ్చారు.


Also Read: జాక్ పాట్ కొట్టిన ప్రేరణ.. రూ. అరకోటికి పైగా..?

అంత కోపమెందుకు.?

ప్రేరణకు కోపం ఎక్కువ. ఇది బిగ్ బాస్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి తెలిసిన విషయమే. అబ్బాయిల్లో కోపంలో మాటలు జారిన కంటెస్టెంట్‌గా పృథ్వి ఉంటే.. అమ్మాయిల్లో ఆ లిస్ట్‌లో ముందుగా ప్రేరణ ఉంటుంది. కోపంలో మాటలు వదిలేసి చాలాసార్లు నాగార్జునతో తిట్లు తిన్నది ప్రేరణ. బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కొత్తలో కొన్నాళ్ల పాటు కన్ఫ్యూజన్‌లో చాలా టాస్కులో తన మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి తాను గెలవలేకపోతే ఆ కోపమంతా ఇతర కంటెస్టెంట్స్‌పై చూపిస్తుంది ప్రేరణ. చెప్పే విషయం కరెక్టే అయినా, దానిని అరుస్తూ చెప్పడం, మాటలు వదిలేయడం వల్ల ప్రేరణపై నెగిటివిటీ ఏర్పడింది.

అంత ఇంప్రెస్ చేయలేదు

కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ 8లో అడుగుపెట్టిన కొత్తలో కొన్నాళ్లు ప్రేరణ టాస్కుల్లో అంత యాక్టివ్‌గా లేదు. కానీ మెల్లగా ట్రాక్‌లో పడింది. అప్పటినుండి చివరి వరకు ప్రతీ టాస్క్‌లో తన బెస్ట్ ఇచ్చింది. అలాగే తన ఫ్రెండ్స్ సపోర్ట్‌తో మెగా చీఫ్ కూడా అయ్యింది. కానీ తను మెగా చీఫ్ అయిన వారాన్ని కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా మర్చిపోలేరు. మెగా చీఫ్‌‌గా తన ప్రవర్తన, పొగరు, మాటలు.. ఇవన్నీ కంటెస్టెంట్స్‌ను చాలా హర్ట్ చేశాయి. ఆఖరికి తను ఎవరి వల్ల మెగా చీఫ్ అయ్యిందో వారికే వెన్నుపోటు కూడా పొడిచింది. బిగ్ బాస్ విన్నర్ అవ్వాలంటే ప్రేక్షకులను అమితంగా ఇంప్రెస్ చేయాలి. ఆ విషయంలో ప్రేరణ కాస్త వెనకబడింది కాబట్టి తను బిగ్ బాస్ 8లో విన్నర్ కాకుండా రన్నర్ స్థానం దగ్గరే ఆగిపోయే అవకాశం ఉంది.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×