Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రభాస్ (Prabhas), బాహుబలి(Bahubali) సినిమా తర్వాత అన్నీ వరుస పెట్టి, పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే అందులో పలు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా కథపరంగా ప్రేక్షకులను మెప్పించ లేకపోయినా.. కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గత ఏడాది వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్(Ashwini dutt), ప్రియాంక దత్(Priyanka dutt), స్వప్న దత్(Swapna Dutt) నిర్మాణంలో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపు దిద్దుకున్న చిత్రం ‘కల్కి 2898AD ‘.భవిష్యత్తులో కలియుగం అంతం అయితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కల్పిత కథగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు కల్కి2, స్పిరిట్, రాజా సాబ్, ఫౌజీ వంటి సినిమాలను లైన్ లో పెట్టారు ప్రభాస్. అందులో భాగంగానే మారుతీ (Maruthi) దర్శకత్వంలో ‘రాజాసాబ్’ , హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు మరొకవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Varma)దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వైరల్ గా మారుతోంది. మరి ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ ను ఢీ కొట్టనున్న మెగా హీరో..
తాజాగా సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ నుండి వైరల్ గా మారిన వార్త ఏంటంటే.. ఈ సినిమాలో విలన్ గా మెగా హీరో నటించబోతున్నారని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ను ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ తో డైరెక్టర్ సందీప్ చర్చలు కూడా జరిపినట్లు ఆయన కూడా అంగీకరించినట్లు సమాచారం. ప్రస్తుతం దీనిపై నిజా నిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వినిపిస్తున్న ఈ వార్తను బట్టి చూస్తే వరుణ్ తేజ్ ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్రకు చాలా ధీటుగా ఈ రోల్ ని రాసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సందీప్ సినిమాల్లో హీరో విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయో..’ యానిమల్ ‘ సినిమాతో అది ప్రూవ్ అయిపోయింది.
స్పిరిట్ కథ..
ఇక స్పిరిట్ కథ విషయానికే వస్తే.. స్పిరిట్ కూడా పక్క రా మెటీరియల్ అని ముందే హింట్ ఇచ్చాడు డైరెక్టర్. నాలుగైదు రకాల డ్రగ్స్ ఇచ్చిన ఒక మత్తులా ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కుతుందని కూడా ఆయన కామెంట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయట. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ ఇప్పుడు స్పిరిట్ మూవీ తో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తారో చూడాలి.
అదృష్టం కలిసొచ్చేనా..
ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్న విషయం తెలిసిందే. చివరిగా ‘మట్కా’ సినిమా చేసిన ఆయనకి ఆ సినిమాతో కూడా నిరాశే మిగిలింది. అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ చూడాలని కోరుకుంటున్న వరుణ్ తేజ్ కి సందీప్ రూపంలోనైనా అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.