BigTV English

CM Revanth Reddy: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి సాధన.. అమెజాన్‌తో కీలక ఒప్పందం

CM Revanth Reddy: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి సాధన.. అమెజాన్‌తో కీలక ఒప్పందం

CM Revanth Reddy: సైలెంట్ గా తనపని తాను చేసుకుంటూ ముందుకు సాగడంలో ఎవరైనా సీఎం రేవంత్ రెడ్డి తరువాతే అంటారు కాంగ్రెస్ నాయకులు. హంగామా ఉండదు.. ఆడంబరం కోరుకోరు.. అనుకున్న లక్ష్యాన్ని సాధించకుండ ఉండరు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మాట అంటున్నది కూడ తెలంగాణ కాంగ్రెస్. విదేశీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రపంచంలోనే పేరు గాంచిన సంస్థల ప్రతినిధులను ఒప్పించడమే. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అనుక్షణం పెట్టుబడుల సాధనపై దృష్టి సారించి సక్సెస్ అయ్యారు. తాజాగా మరో సంస్థతో ఏకంగా రూ. 60 వేల కోట్ల పెట్టుబడులను సాధించారు. దీనితో కాంగ్రెస్ సోషల్ మీడియా.. ఇది మా సీఎం సార్ ఘనత అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇంతకు భారీ ఒప్పందం ఏమిటో తెలుసుకుందాం.


సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటనలో అమెజాన్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దావోస్ వేదికపై తెలంగాణకు ఇప్పటికే భారీగా పెట్టుబడులు వెల్లువల రాగా, అమెజాన్ తో ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ లో ఏకంగా రూ.60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ కంపెనీ అంగీకరించింది. డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పుంకేతో భేటీ అయ్యారు. దాదాపు రూ. 60000 కోట్ల పెట్టుబడుల ప్రణాళికలతో హైదరాబాద్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ తమ డేటా సెంటర్‌లను పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. భవిష్యత్తులో అర్టిఫిషియల్ ఆధారిత క్లౌడ్ సేవల వృద్ధికి ఈ డేటా సెంటర్లు కీలకంగా మారనున్నాయి. తెలంగాణలో తన క్లౌడ్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి 2030 నాటికి 4.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే ప్రకటించింది.


ఒక బిలియన్ పెట్టుబడులతో రాష్ట్రంలో మూడు సెంటర్లను గతంలోనే అభివృద్ధి చేసింది. ఈ మూడు కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. కొత్తగా చేపట్టే విస్తరణ ప్రణాళికలకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఈ అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వం అందుకు అంగీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులకు ముందుకు రావటం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ తో ప్రజా ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో హైదరాబాద్ దేశంలో డేటా సెంటర్ల కేంద్రంగా తిరుగులేని గుర్తింపు సాధిస్తుందని ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు అన్నారు.

Also Read: Satyam Srirangam : బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ రుసరుస.. పదేళ్లు చేసింది చాలు

అలాగే హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ భారీ విస్తరణ దిశగా నిర్ణయం తీసుకుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమైన ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంగ్రాజ్కా ఈ మేరకు ప్రకటించారు. ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్‌లో ఇన్ఫోసిస్ సంస్థ రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం సాగుతుంది. ఈ ఒప్పందంపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసే లక్ష్యంతో అన్ని రంగాల్లో ప్రముఖ సంస్థలు, పారిశ్రామిక దిగ్గజాలకు ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందన్నారు.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×