Thyroid Problems: థైరాయిడ్ వ్యాధి నిశ్శబ్దంగా శరీరాన్ని లోపలి నుండి బలహీనపరుస్తుంది. థైరాయిడ్ సాధారణ లక్షణాలు బలహీనత, అలసట, శ్వాస ఆడకపోవడం , బరువు పెరగడం లేదా తగ్గడం. కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల థైరాయిడ్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు.
థైరాయిడ్ వ్యాధి పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ అనేది మెడ ముందు భాగంలో, స్వరపేటిక క్రింద ఉన్న ఒక గ్రంథి. జీవక్రియ రేటును నియంత్రించడంతో పాటు, ఇది హార్మోన్ ఉత్పత్తి, జీర్ణక్రియ, కండరాల నియంత్రణ, మెదడు ఆరోగ్యం, అభివృద్ధి, ఎముకల బలం , మానసిక స్థితిని కూడా నియంత్రిస్తుంది.
థైరాయిడ్ రుగ్మతలు సాధారణంగా హార్మోన్ల అధిక ఉత్పత్తి లేదా తక్కువ ఉత్పత్తి కారణంగా సంభవిస్తాయి. థైరాయిడ్ ప్రారంభంలో హార్మోన్ల అసమతుల్యతలను సరిచేయడానికి మందులు వాడవచ్చు.
శరీరంలోని అన్ని హార్మోన్ల ఉత్పత్తికి థైరాక్సిన్ హార్మోన్ అవసరం. థైరాక్సిన్ (T4) , ట్రైయోడోథైరోనిన్ (T3)లను సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లు అంటారు. కాల్షియం స్థాయిలను నియంత్రించడానికి కాల్సిటోనిన్ అవసరం. శరీరంలో థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువైనా లేదా లోపించినా కూడా వ్యక్తిని అనారోగ్యానికి గురి చేస్తుంది.
మునగ కాయలు , ఆకులు:
థైరాయిడ్ నియంత్రణకు మునగ కాయలు లేదా ఆకులను మీ ఆహారంలో ఏ రూపంలోనైనా చేర్చుకోండి. అవి పోషకాలతో నిండి ఉంటాయి. అంతే కాకుండా థైరాక్సిన్ హార్మోన్ను పెంచడంలో ఇవి సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇన్సులిన్‌ను పెంచడంలో కూడా ఇవి సహాయపడతాయి.సెలీనియం అధికంగా ఉండే మునగ ఆకులు, కాయలు ఆయుర్వేద మూలికల నిధి.
అల్లం వినియోగం:
వంటగదిలో ప్రధానమైన అల్లం కూడా థైరాయిడ్ మందుల లాగా పనిచేస్తుంది. పొటాషియం ,మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న అల్లం వాపును తగ్గిస్తుంది. హార్మోన్లను సరిదిద్దుతుంది . మూడ్ బూస్టర్‌గా పనిచేస్తుంది. ప్రతిరోజు అల్లం ఏ రూపంలోనైనా తీసుకోవడం అలవాటు చేసుకోండి.
కొత్తిమీర నీరు:
థైరాయిడ్ గ్రంధి సమస్యలు ఉన్నవారికి కొత్తిమీర నీరు వాడటం మంచిది. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు , విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది థైరాయిడ్‌ను నయం చేయడంలో , థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
జీలకర్ర నీరు:
జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది ఆహారం యొక్క రుచిని పెంచడమే కాకుండా థైరాయిడ్ వంటి తీవ్రమైన పరిస్థితుల చికిత్సలో కూడా సహాయపడుతుంది. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు జీలకర్ర నీళ్లు త్రాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
అశ్వగంధ :
ఆయుర్వేదంలో అశ్వగంధ అనేది ఒత్తిడిని నిర్వహించడానికి సహాయపడే ఒక ప్రముఖ హెర్బ్. ఇది భారతదేశం , ఉత్తర ఆఫ్రికాలో సహజంగా పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లను తగ్గించడం ద్వారా హైపోథైరాయిడిజం చికిత్సకు ఇది సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
Also Read: 30 రోజులు బాదం తింటే.. ఏం జరుగుతుందో తెలుసా ?
వాటర్ హైసింత్ లేదా సెవర్:
వాటర్ హైసింత్ లేదా సెవర్ థైరాయిడ్ సమస్యలకు మందులా పనిచేస్తుంది. వాటర్ హైసింత్‌లో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. దీని వినియోగం హైపో థైరాయిడిజం ఉన్న రోగులకు ఎంతో మేలు చేస్తుంది. అంతే కాకుండా ఈజీగా థైరాయిడ్ తగ్గడంలో ఉపయోగపడుతుంది.