BigTV English

Niharika Birthday: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.. విడాకుల తర్వాత కెరీర్ పై ఫోకస్..

Niharika Birthday: మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల.. విడాకుల తర్వాత కెరీర్ పై ఫోకస్..

Niharika Birthday: నిహారిక కొణిదెల.. ఆమె పేరుతో పాటు అటాచ్ అయి ఉన్న ఇంటిపేరు కారణంగా మొదటి నుంచి బాగా పాపులర్ అయింది ఈ మెగా ప్రిన్సెస్. మెగా ఫ్యామిలీలో యాక్టర్లు ఎందరో ఉన్నారు కానీ ఆ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి నటిగా వచ్చింది మాత్రం నిహారికే అనడంలో డౌట్ లేదు. మెగా బ్రదర్ నాగేంద్రబాబు అలియాస్ నాగబాబు గారాలపట్టి ఈ నిహారిక కొణిదెల. ఢీ జూనియర్స్ అనే డాన్స్ రియాలిటీ షో కి యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన నిహారిక.. ఆ తర్వాత ముద్దపప్పు ఆవకాయ్ అనే వెరైటీ వెబ్ సిరీస్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.


2016లో నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఎలాంటి భిన్నమైన పాత్రలో అయినా ఇట్టే ఇమిడిపోవడం నిహారిక స్పెషాలిటీ. ముద్దపప్పు ఆవకాయ్ షార్ట్ ఫిలిం లో.. మోడ్రన్ యువతిగా మోడరన్ డ్రస్సులు వేసుకుని అలరించిన నిహారిక.. ఒక మనసు చిత్రంలో ఎంతో ట్రెడిషనల్ గా చుడీదార్లు, చీరలతో మెప్పించింది. ఆ తర్వాత తండ్రి నాగబాబుతో కలిసి నాన్న కూచి అనే మూవీ లో యాక్ట్ చేసింది. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా ఓ చిన్న పాత్ర పోషించింది నిహారిక. ఆ తర్వాత 2019లో ఆమె నటించిన సూర్యకాంతం చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్టోరీ రొటీన్ గా ఉన్నప్పటికీ ఈ చిత్రంలో సూర్యకాంతం పాత్ర మాత్రం ఆడపిల్లలను బాధల నుంచి రిఫ్రెష్ చేసే విధంగా ఉంది అని చాలామంది మెచ్చుకున్నారు.

2020 డిసెంబర్ నెలలో గుంటూరుకు చెందిన చైతన్య జొన్నలగడ్డతో ఆమె వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరిగింది. అయితే కొన్ని మనస్పర్ధలు కారణంగా 2023 మే 19న వీరిద్దరూ కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు దాఖలు చేశారు. ఆ తరువాత ఇద్దరికీ మ్యూచువల్ డైవర్స్ మంజూరు అయ్యింది. పెళ్లి.. విడాకుల తర్వాత.. ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ తో నిహారిక బిజీగా ఉంది. ఈమె నటించిన డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ మే 19 2023 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. నటిగా ఇంతవరకూ మంచి సక్సెస్ అందుకోలేక పోయిన నిహారిక.. నిర్మాతగా మారింది. నిహారిక తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలో నిమగ్నమైంది. మెగా ప్రిన్సెస్ కు బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.


Tags

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×