Chiranjeevi.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, స్వయంకృషితో నేడు మెగాస్టార్ గా చలామణి అవుతున్నారు. ఏడుపదుల వయసుకు చేరువలో ఉన్న చిరంజీవి.. ప్రస్తుతం వశిష్ట మల్లిడి(Vassista Mallidi) దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మే 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరొకవైపు ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని కూడా మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విడుదల తేదీ పై ఇప్పటివరకు ఎటువంటి క్లారిటీ రాలేదని చెప్పాలి.
నిర్మాతగా మారిన నాని..
ఇదిలా ఉండగా.. ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండాలని ప్రవర్తించే వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు. ముఖ్యంగా ఎన్నో ఎత్తుపల్లాలు చూసి, మరెన్నో శిఖరాలను చూసిన ఈయన, తన తోటి నటీనటులతోనే కాదు తనకంటే చిన్న వారిని కూడా గౌరవంగా పిలుస్తూ అందరికీ అన్నయ్యగా పేరు కూడా సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి నాని (Nani) ని చూసి అన్న ఒక మాటకు నాని కంగారు పడిపోయారట. మరి నానిని చూసి చిరంజీవి ఏమన్నారు? అసలు ఏం జరిగింది ? అనేది నాని మాటలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. నాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా వరుస మాస్ యాక్షన్ పర్ఫామెన్స్ తో సినిమాలు ప్రకటిస్తూనే..నిర్మాతగా కూడా మారి ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియదర్శి హీరోగా కోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాని.
కోర్ట్ సినిమా యూనిట్ కి ఊరట కలిగించిన చిరంజీవి..
ప్రియదర్శి ప్రధాన పాత్రలో.. హర్ష రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ, రోహిణి , సాయికుమార్, హర్షవర్ధన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు రామ్ జగదీష్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇదే సినిమాతో ఆయన డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు కూడా.. ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర బృందం వేగంగా ప్రమోషన్స్ చేపట్టింది. అందులో భాగంగానే ప్రియదర్శి తో పాటు నాని అలాగే టీం మొత్తం కబుర్లు పెట్టుకోగా ప్రియదర్శి మాట్లాడుతూ.. “ఇప్పుడే చిరంజీవి గారిని కలిసి వస్తున్నాను. ఆయన నన్ను చూసి ఒక సూట్ లో చాలా బాగా కనిపించావు అంటూ అన్నారు. కోర్ట్ సినిమా చేస్తున్నాను సార్ అని చెప్పగానే ..నాని కదా ఇక అయిపోతుందిలే అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పడంతో.. అంత గొప్ప వ్యక్తి చెప్పడంతో నాకు ఇంకా సంతోషం వేసింది” అంటూ ప్రియదర్శి తెలిపారు.
ప్రొడ్యూసర్ గారు అంటూ నానిని సంబోధించిన చిరంజీవి..
అదే సమయంలో నాని – చిరంజీవి మధ్య గతంలో జరిగిన విషయాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు. నాని మాట్లాడుతూ..” ఇటీవల నాగచైతన్య వివాహం జరిగింది కదా.. ఆ వివాహానికి నేను హాజరయ్యాను. కారు దిగి నేను లోపలికి వెళ్తుండగా.. ఆయన లోపల నుండి బయటకు వచ్చారు. సడన్గా నన్ను చూసి ప్రొడ్యూసర్ గారు అనడంతో ఒక్కసారిగా నేను కంగారు పడిపోయాను నా వెనుకల అశ్వినీ దత్ తో ఇంకెవరైనా ప్రొడ్యూసర్లు వచ్చారేమో అని వెనక్కి తిరిగి చూస్తే.. ఎవరూ లేరు. ఇక నేను నన్నేనా సార్ అని అంటే మిమ్మల్నే అంటూ హగ్ ఇచ్చారు. ఇక చిరంజీవి ప్రొడ్యూసర్ గారు అనేసరికి నేను కంగారు పడిపోయాను” అంటూ నాని తెలిపారు. మొత్తానికైతే ఒక్క మాటతో చిరంజీవి నానిని కంగారు పెట్టేసారని చెప్పవచ్చు.