పెళ్లయిన తర్వాత పదేళ్లపాటు అందరూ ఆనందంగానే జీవిస్తున్నారు. ఆ తర్వాతే ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. తమ వైవాహిక బంధానికి స్వస్థి చెబుతున్నారు. అన్నేళ్ల పాటూ కలిసి జీవించి విడాకులు తీసుకోవడమే విచిత్రంగా అనిపిస్తోంది. పెళ్లైన పదేళ్ల తర్వాత జంటల మధ్య దూరం పెరగడం మొదలవుతున్నట్టు తెలుస్తోంది.
పెళ్లయిన పదేళ్ల తర్వాత దూరం ఎందుకు?
ఏ జంటలు అయితే తమకున్న అపార్ధాలను అనుమానాలను బహిరంగంగా మాట్లాడుకోరో వారి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది. భావద్వేగాల అనుబంధం లేకపోవడం వల్ల కూడా సంబంధం బలహీనపడడం ప్రారంభమవుతుంది. భాగస్వాములు పదేళ్లలోనే ఒకరికి ఒకరు భావోద్వేగపరంగా దగ్గర అవ్వాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ అనుబంధం పదేళ్ల తర్వాత కూడా దృఢంగా మారుతుంది.
సుదీర్ఘ వివాహంలో జంటలకు కుటుంబం, బంధువులు, పిల్లలు, వారి చదువులు వంటి బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యంగా పెళ్లి అయిన పదేళ్ల తర్వాతే ఈ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దీంతో జంటలు ఒకరితో ఒకరు సమయం గడపలేక వారి మధ్య దూరం పెరిగిపోతుంది. అలాగే వారి జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి.
త్వరగా విసుగు చెందడం, జీవితం బోరింగ్ గా అనిపించడం వంటివి పెళ్లైన పదేళ్ల తర్వాతే ప్రారంభమవుతాయి. భార్యాభర్తల అనుబంధంలో కొత్తదనం తగ్గినప్పుడు దూరం చేరిపోతుంది. చాలా కాలం పాటు కలిసి ఉన్న జంటలు కూడా ఒకరినొకరు తేలిగ్గా తీసుకొని ఇతరుల వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు.
దూరాన్ని ఎలా తగ్గించుకోవాలి
భార్యాభర్తలు తమ అనుబంధాన్ని బలోపేతం చేయడానికి ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడుకోవాలి. వారి ఆలోచనలు, భావాలు సమస్యలను బహిరంగ పంచుకోవాలి. ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపాలి. సంబంధంలో కొత్తదనాన్ని పెంచుకోవడం కోసం డేటింగ్ వంటివి ప్లాన్ చేయాలి. ఇద్దరూ కలిసి ప్రయాణించాలి. సడన్ సర్ ప్రైజ్‌లు ఇచ్చుకోవాలి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉందని చెప్పుకోవాలి. నమ్మకం ఏ బంధాన్ని విచ్ఛిన్నం కానివ్వదు.
Also Read: వీటిని పొరపాటున కూడా ఫ్రిజ్‌లో.. పెట్టకూడదు తెలుసా ?
భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవాలి. ఒకరికి ఒకరు అన్నట్టు జీవించాలి. ఎప్పుడైతే వారిద్దరి మధ్య దూరం పెరిగిపోతుందో వారు ఇక కలిసి జీవించడం కష్టంగా మారిపోతుంది. కాబట్టి పెళ్లయి పదేళ్లు దాటినా కూడా వారి బంధాన్ని తాజాగా ఉంచుకునేందుకు భార్యాభర్తలిద్దరూ ప్రయత్నించాలి. పిల్లలకు తల్లిదండ్రులు కలిసి ఉండడం చాలా ముఖ్యం. లేకుంటే వారి భవిష్యత్తు, కలలు కల్లలుగా మారిపోతాయి.