Megastar Chiranjeevi about satyadev: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు పెద్దమనిషి అంటే దాసరి నారాయణరావు పేరు వినిపించేది. ఆయన మరణాంతరం తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే వాళ్ళు ఎవరూ లేరు అనుకునే టైంలో మెగాస్టార్ చిరంజీవి పెద్ద దిక్కు వహించారు. ఆ విషయాన్ని ఆయన బయటకు చెప్పకపోయినా కూడా ఆయన చేసే కార్యక్రమాలు ప్రతిసారి దానిని నిరూపిస్తూనే ఉంటాయి. కరోనా టైంలో ఆయన నిలబడిన తీరు, ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయడం, నిత్యవసర వస్తువులను ఇవ్వడం ఇవన్నీ కూడా మెగాస్టార్ లో మానవత్వాన్ని చాటి చెప్పాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మితమవుతున్న చాలా కొత్త సినిమాలు కూడా ఆయన సపోర్ట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవిని చాలామంది అభిమానులు ముద్దుగా అన్నయ్య అని పిలుచుకుంటారు. ఆయనను చూసే చాలామంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. ఇప్పుడున్న చాలామంది దర్శకులు ఆయన అభిమానులే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక ఈవెంట్లో చెప్పినట్లు తనంతట తాను ఎదిగి ఎంతోమంది హీరోలను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చారు. మెగాస్టార్ కి ఇద్దరు తమ్ముళ్లు ఉన్న విషయం తెలిసిందే. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లోని మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా మారారు. అలానే మరో బ్రదర్ నాగబాబు కూడా జనసేన పార్టీలో కీలకపాత్రను పోషిస్తున్నారు. ఇక సత్యదేవ్ నటించిన జీబ్రా మూవీ ఫంక్షన్ కి హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి. సత్యదేవ్ ను ఉద్దేశిస్తూ నాకు ఇద్దరు తమ్ముళ్లుంటే నాకు మూడో తమ్ముడు లాంటివాడు సత్యదేవ్ అంటూ చెప్పుకొచ్చారు. జీబ్రా సినిమా నవంబర్ 22న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. హీరోగా కూడా ఎన్నో సినిమాలను చేశాడు సత్యదేవ్. కానీ సత్యదేవ్ కి సరైన బ్రేక్ రాలేదు.
Also Read : Megastar Chiranjeevi speech at zebra Pree Release Event: మెగాస్టార్ ది మాములు టైమింగ్ కాదయ్యా
హీరోగా సినిమాలు చేస్తున్న తరుణంలోని మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా అవకాశం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా నటించడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఈ విషయం గురించి మెగాస్టార్ చిరంజీవి కూడా మాట్లాడుతూ.. “సత్యదేవ్ నువ్వు ఇప్పటికి ఒక ముగ్గురికి తెలిస్తే, నాతో కలిసి నటిస్తే చిరంజీవికి ఎదురుగా నిలబడటం వలన ఒక పదిమందికి తెలుస్తావ్, కొంతమంది దర్శకులకు నీ ప్రతిభ తెలుస్తుంది. మరి కొన్ని అవకాశాలు వస్తాయి నువ్వు ఈ సినిమా చేయాలి” అని మెగాస్టార్ చిరంజీవి ఒప్పించారట. ఈ సినిమాలో సత్యదేవ్ పర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మెగాస్టార్ కి విలన్ గా చేయడం అనేది మామూలు విషయం కాదు. మొత్తానికి ఈ సినిమా కూడా ఒక మోతాదు సక్సెస్ అందుకుంది.