BigTV English

HIV Cases Rise In Tripura: త్రిపురలో డేంజర్ బెల్స్, హెచ్ఐవీతో 47మంది మృతి.. మరో 800 పైగానే…

HIV Cases Rise In Tripura: త్రిపురలో డేంజర్ బెల్స్, హెచ్ఐవీతో 47మంది మృతి.. మరో 800 పైగానే…

HIV Cases Rise In Tripura: త్రిపురలో ఏం జరుగుతోంది? ఒక్కసారిగా హెచ్ఐవీ మరణాలు ఎలా బయటకువచ్చాయి? హెచ్ఐవీ అక్కడ డేంజర్ బెల్స్ మోగిస్తోందా? ఇన్నాళ్లు అక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? తెలిసినా లైట్‌గా తీసుకున్నాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


సెవెన్ సిస్టర్ స్టేట్స్‌లో ఒకటి త్రిపుర. అక్కడ హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మరణించిన విషయం తెలిసి యావత్తు భారతావని షాకైంది. అంతేకాదు 828 మంది విద్యార్థులకు సోకిందని త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు బయటపెట్టారు. ప్రతీరోజూ ఐదు నుంచి ఏడు కేసుల వరకు నమోదవుతున్నట్లు తేలింది. ఆ రాష్ట్రంలో దీనిబారిన పడినవారి సంఖ్య 5,674 పైమాటే. బాగా డబ్బున్న వారి కుటుంబాల పిల్లలు ఈ మహమ్మారి బారినపడుతున్నట్లు వెల్లడైంది.

ఈ కేసుల పెరుగుదల వెనుక మాదక ద్రవ్యాలే కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. త్రిపుర వ్యాప్తంగా 220 స్కూల్స్, 24 కాలేజీలు, యూనివర్సిటీల విద్యార్థులు డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు గుర్తించింది ఆ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. 2024 మే నాటికి యాంటీ రెట్రో వైరల్ థెరపీ కేంద్రాల్లో దాదాపు 9000 మందిని గుర్తించింది. వీరిలో 4500 మంది పురుషులు, 1100 మంది మహిళలు, ట్రాన్స్‌జెండర్ ఒకరున్నారు.


త్రిపురకు డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మయన్మార్ నుంచి మిజోరం మీదుగా త్రిపుర, అసొం ఇలా మిగతా రాష్ట్రాలకు మత్తు పదార్దాలు సరఫరా అవుతున్నాయి. డ్రగ్స్‌ అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పొరుగు దేశాల నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు సరిహద్దుల్లో గట్టి నిఘాను పెంచారు. అయినా సరే డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుబడుతోంది. ఈ మధ్యకాలంలో చాలామంది చిక్కారు కూడా.

ALSO READ: హాత్రాస్ ఘటన తర్వాత.. మీడియాతో భోలేబాబా.. ఆ నాలుగు మాటలు

డ్రగ్స్ ఉత్పత్తిలో ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు టాప్ ప్లేస్‌లో ఉండేది. దాన్ని వెనక్కి నెట్టేసింది మయన్మార్. ప్రపంచంలో అత్యధికంగా నల్ల మందు ఉత్పత్తి చేస్తున్న దేశంగా మయన్మార్ నిలిచిందని ఐక్యరాజ్య సమితి రిపోర్టు చెబుతున్నమాట. గతేడాది తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్‌పై నిషేధం విధించడంతో అక్కడ నల్లమందు సాగు బాగా పడిపోయింది. క్రూరమైన అంతర్యుద్ధంలో అట్టుడుకు తున్నమయన్మార్‌లో నల్లమందు సాగు విపరీతంగా జరుగుతోంది. దీన్ని అక్కడి మిలటరీ పాలకులు ఆదాయ వనరుగా మార్చారు.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×