BigTV English

The Raja Saab: మెగాఫాన్స్ కు పండగే.. రాజా సాబ్ సినిమాలో చిరు.. టీజర్ లో ఇది గమనించారా?

The Raja Saab: మెగాఫాన్స్ కు పండగే.. రాజా సాబ్ సినిమాలో చిరు.. టీజర్ లో ఇది గమనించారా?

The Raja Saab: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ (The Raja Saab)సినిమా ఈ ఏడాది చివరన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రానికి డిసెంబర్ ఐదో తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇకపోతే రాజా సాబ్ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న నేపథ్యంలో నేడు ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.


అదిరిపోయిన ప్రభాస్ లుక్స్..

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ప్రభాస్ ను తన సినిమాలలో ఇలాంటి పాత్రలలో చూసి చాలాకాలం అవుతుందని ప్రభాస్ నటన మాత్రం అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఈ టీజర్ మెగా అభిమానులకు(Mega Fans) మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కనిపించడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఆకట్టుకున్న చిరు పోస్టర్..

ఈ సినిమాలో ప్రభాస్ మొహానికి మాస్క్ వేసుకొని రౌడీలను కొడుతున్న నేపథ్యంలో ఒకచోట రౌడీలు అందరినీ గుంపుగా పడేసి వారిపై పడుకున్నట్టు చూపిస్తారు. అయితే వెనకే ఉన్న టీ స్టాల్ బండిపై చిరంజీవి (Chiranjeevi)పోస్టర్ ఉండటం విశేషం. ఇలా చిరంజీవి పోస్టర్ ఈ టీజర్ లో కనిపించడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఈ పోస్టర్ పై పెద్ద ఎత్తున మీమ్స్ పేలుతున్నాయి.  అలాగే ఈ పోస్టర్ చూసిన మెగా అభిమానులు డైరెక్టర్ మారుతి ప్రభాస్ సినిమాలో చిరంజీవి పోస్టర్ చూపించారంటే ఇక తదుపరి సినిమాలో ఏకంగా పవన్ కళ్యాణ్ పోస్టర్ చూపిస్తాడేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ ముగ్గురు ఫేవరెట్ హీరోలా..

ఇకపోతే ఈ టీజర్ లో చిరంజీవితో పాటు మరో ఇద్దరు హీరోల పోస్టర్లు కూడా అక్కడ కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే మిగతా ఇద్దరు హీరోలు ఒకరు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitab Bachchan)కాగా, మరొకరు కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajini Kanth) అని తెలుస్తుంది. అయితే ప్రభాస్ కు ఇష్టమైన హీరోలలో తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్, బాలీవుడ్ లో అమితాబ్ అంటే ఇష్టమని పలు సందర్భాలలో తెలియచేశారు. అందుకే ఈ ముగ్గుర హీరోల పోస్టర్లను కూడా ఈ టీజర్ లో చూపించారని స్పష్టం అవుతుంది.. ఏది ఏమైనా ప్రభాస్ సినిమాలో ఇలా చిరంజీవితో పాటు రజనీకాంత్ అమితాబ్ కనిపించడంతో వీరి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న  ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి సిద్ధమయ్యారని చెప్పాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×