BigTV English

OTT Movie : ఉగ్రవాదులను మట్టుబెట్టే రియల్ స్టోరీ.. మతిపోగొట్టే ట్విస్టులు.. యాక్షన్ సీన్స్ తో ఊహించని క్లైమాక్స్

OTT Movie : ఉగ్రవాదులను మట్టుబెట్టే రియల్ స్టోరీ.. మతిపోగొట్టే ట్విస్టులు.. యాక్షన్ సీన్స్ తో ఊహించని క్లైమాక్స్

OTT Movie  :  భారత పార్లమెంట్ దాడి తర్వాత BSF అధికారి నరేంద్ర నాథ్ ధర్ దుబే నేతృత్వంలో జరిగిన రేషన్‌పై తెరకెక్కిన ఒక మూవీ, రీసెంట్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ నెల 20 న ఓటీటీలోకి రాబోతోంది. ఈ స్టోరీ 2001 డిసెంబర్ 13, దేశ రాజధాని ఢిల్లీలో భారత పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి చుట్టూ తిరుగుతుంది. ఈ దాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్న BSF డిప్యూటీ కమాండెంట్ నరేంద్ర నాథ్ ధర్ దుబే (ఇమ్రాన్ హష్మీ), ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఘాజీ బాబా (రాకీ రైనా)ను పట్టుకోవాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ముందుకు వెళతాడు. ఈ క్రమంలో శ్రీనగర్ వీధుల్లో దుబే ఒక పెద్ద కుట్రను ఛేదించే పనిలో ఉంటాడు. ఈ దాడి తరువాత దుబే ఎదుర్కున్న సవాళ్లు ఏమిటి? జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ ఘాజీ బాబా కుట్రలను ఎలా అమలు చేస్తాడు? ఈ మూవీ పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం.


స్టోరీలోకి వెళితే 

2001 భారత పార్లమెంట్ దాడి, 2002 అక్షరధామ్ దేవాలయ దాడులకు మాస్టర్‌మైండ్‌గా ఉన్న జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాది రాణా తాహిర్ నదీమ్, అలియాస్ ఘాజీ బాబా, ను 2003లో ఎదుర్కొన్న BSF అధికారి నరేంద్ర నాథ్ ధర్ దుబే నిజ జీవిత ఆపరేషన్‌పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ స్టోరీ 2001లో కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మొదలవుతుంది. అక్కడ ‘పిస్తోల్ గ్యాంగ్’ అనే రాడికలైజ్డ్ కాలేజీ విద్యార్థుల బృందం BSF జవాన్లపై టార్గెటెడ్ హత్యలు చేస్తుంది. ఒక్కో జవాన్ హత్యకు రూ.5000 చెల్లిస్తుంటారు. దుబే ఈ గ్యాంగ్‌ను ఛేదించే క్రమంలో, దాడుల వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది. పార్లమెంట్ దాడి తర్వాత, దుబే ఘాజీ బాబాను పట్టుకోవడానికి రెండేళ్ల పాటు ఇంటెలిజెన్స్ శ్రమిస్తాడు. అతను స్థానిక పౌరుల జీవితాలను అర్థం చేసుకుంటూ, టెర్రర్ నెట్‌వర్క్‌ను డిస్మాంటిల్ చేయడానికి ప్రయత్నిస్తాడు.


ఈ స్టోరీలో దుబే వ్యక్తిగత జీవితాన్ని కూడా చూపిస్తుంది. అతని భార్య జయా (సాయి తాంహంకర్)తో సంబంధం, ఒత్తిడితో కూడిన వృత్తిలోని ఎమోషనల్ టోల్ ని చూపించారు.ఈ రాత్రిపూట జరిగే ఒక ఉత్కంఠభరిత రైడ్‌తో క్లైమాక్స్‌కు చేరుకుంటుంది.ఘాజీ బాబా ఎక్కడ దాక్కున్నాడు? అతని నెక్స్ట్ దాడి ప్లాన్ ఏమిటి? ‘స్తోల్ గ్యాంగ్’వెనుక ఉన్న ట్రైనర్స్ ఎవరు ?క్లైమాక్స్ రైడ్‌లో దుబే బృందం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది, ఆపరేషన్ విజయవంతమవుతుందా? అనే విషయాలను సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే

ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు ‘గ్రౌండ్ జీరో’ (Ground Zero). 2025 ఏప్రిల్ 25 న థియేట్రికల్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి తేజస్ ప్రభా విజయ్ దేవస్కర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ (నరేంద్ర నాథ్ ధర్ దుబే, BSF డిప్యూటీ కమాండెంట్),సాయి తాంహంకర్ (జయా దుబే, దుబే భార్య),జోయా హుస్సేన్ (ఆదిలా, ఇంటెలిజెన్స్ అధికారి),ముకేష్ తివారీ (సంజీవ్ శర్మ, BSF సీనియర్ అధికారి),రాకీ రైనా (ఘాజీ బాబా, జైష్-ఎ-మహమ్మద్ టెర్రరిస్ట్),రాహుల్ వోరా (IB చీఫ్), దీపక్ పరమేష్ (బిను రామచంద్ర, BSF జవాన్), మీర్ మహ్మద్ మెహరూస్ (హుస్సేన్, కీలక పాత్ర) వంటి నటులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 20న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ కు రానుంది.

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×