Gopichandh Malineni: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో గోపీచంద్ మలినేని ఒకరు. రవితేజ నటించిన డాన్ శీను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే ఒక దర్శకుడుగా మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మలినేని చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మాదిరి సక్సెస్ సాధించాయి. ఇక రీసెంట్ గా జాట్ అనే సినిమాతో మంచి సక్సెస్ కూడా అందుకున్నాడు. వాస్తవానికి జాట్ సినిమా కంటే ముందు రవితేజ హీరోగా వాళ్ల కాంబినేషన్ లో 4వ సినిమాను అనౌన్స్ చేశారు గాని కొన్ని కారణాల వలన ఆ సినిమా పట్టాలెక్కలేదు.
ఇంట్రోవర్ట్ మలినేని
గోపీచంద్ మలినేని విషయానికి వస్తే చాలామంది దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గాను అసోసియేట్ గాను పనిచేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన అందరివాడు సినిమాకి గోపీచంద్ అసోసియే డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సీన్ నాలుగు నుంచి ఐదు టేకులు చేసేవారు. దీనికి కారణం గోపీచంద్ మలినేని. గోపీచంద్ తాను బాగా ఇంట్రోవర్ట్ అని నేను ఎక్కువగా మాట్లాడను అని ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి పర్ఫామెన్స్ చేస్తున్నప్పుడు దూరంగా ఎక్కడో నిలుచుని ఉండేవాడు గోపీచంద్. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న టైం లో గోపీచంద్ అబ్జర్వ్ చేసేవారు. ఒక టేక్ సరిగ్గా రాకపోతే గోపీచంద్ ముఖంలో ఎక్స్ప్రెషన్ తెలిసిపోయేది. 4వ టేక్ 5 టేక్ చేసినప్పుడు తన ఎక్స్ప్రెషన్ మారేది. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గమనించారు.
చిరంజీవి క్లాస్ పీకారు
ఒకసారి మెగాస్టార్ చిరంజీవి తన మేకప్ రూమ్ కి గోపీచంద్ ను పిలిచారు. నీకు ఏదైనా అనిపించినప్పుడు దానిని చెప్పడం అలవాటు చేసుకో, మొహమాటం ఉండకూడదు. నీ ఎక్స్ప్రెషన్స్ వలనే కేవలం నేను నాలుగు నుంచి ఐదు టేకులు తీసుకున్నాను అని చెప్పారట. నీ టాలెంట్ నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావ్ కానీ నీకు అనిపించింది చెప్పడం అలవాటు చేసుకో అని తెలిపారు. ఆ తర్వాత స్టాలిన్ సినిమాకి అసోసియేట్ గా పనిచేశాడు గోపీచంద్. ఆ సినిమా స్క్రిప్ట్ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి తన అభిప్రాయాలని మొహమాటం లేకుండా చెప్పడం మొదలుపెట్టాడట. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఆ మాటలు మలినేని కెరియర్ కు మంచి ప్లస్ అయ్యాయి. నేడు దర్శకుడు స్థాయికి రావడానికి కూడా ఈ మాటలే పెద్ద ప్లస్ పాయింట్ అయి ఉండొచ్చు.