NBK : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోస్ లో బాలకృష్ణ ఒకరు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆ బాలకృష్ణ సినిమాలు పోటాపోటీగా విడుదలవుతూ ఉండేది. రీసెంట్ టైమ్స్ లో కూడా వీరిద్దరి మధ్య పోటీ నెలకొంది. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యాయి. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడున్న జనరేషన్ కి ఈ సినిమాలు మాత్రమే బాగా గుర్తున్నాయి. బాలకృష్ణ విషయానికి వస్తే లెజెండ్ సినిమా తర్వాత బాలకృష్ణ చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతూనే ఉన్నాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన సినిమాలు ఏవి కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయాయి. మళ్లీ బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి చేసిన అఖండ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.
అన్ స్టాపబుల్ తెచ్చిన మార్పు
ఒకప్పుడు సోషల్ మీడియాలో బాలయ్యను విపరీతంగా ట్రోల్ చేసేవారు. ఫ్యాన్స్ కనిపిస్తే కొడతారని, అసలు సంస్కారం ఉండదని, ఎక్కడికి ఏం మాట్లాడుతారో తెలీదని ఇలా రకరకాల ట్రోల్స్ వినిపిస్తూ వచ్చేవి. అయితే ఆహాలో ప్రసారమైన అన్స్టాపబుల్ షో తర్వాత బాలకృష్ణను చూసే విధానం కంప్లీట్ గా మారిపోయింది. యంగ్ హీరోస్ తో బాలకృష్ణ ఎంత యాక్టివ్ గా ఉంటారు ఆ షో తర్వాత చాలామందికి తెలిసి వచ్చింది. అక్కడి నుంచి బాలయ్యను చూసే విధానం కంప్లీట్ గా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది.
Also Read : Varun Tej – Lavanya : తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్.? ఈ విషయంలో లేట్ చేయలేదు.!
బాలయ్య కు మిస్ అయినా సినిమా
అఖండ సినిమా సక్సెస్ తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణకు ఒక కథను చెప్పారు. అఖండ అప్పటికే సక్సెస్ కావడంతో ఇప్పుడు ఈ కథ కాకుండా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న కథను చేద్దాం అని బాలకృష్ణ చెప్పడంతో వీర సింహారెడ్డి సినిమాను రెడీ చేసి చెప్పాడు గోపీచంద్. ఇంతకు బాలకృష్ణకు చెప్పిన కథ ఏంటి అంటే రీసెంట్ గా సన్నీ డియోల్ నటించిన జాట్. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి సక్సెస్ సాధించింది. ఇదే సినిమా బాలకృష్ణకు పడితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని చాలామంది ఊహించారు. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు. వాస్తవానికి ఇది బాలకృష్ణ చేయవలసిన కథే అని గోపీచంద్ మలినేని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
Also Read : The Raja Saab : ప్రభాస్ నిర్లక్ష్యం… దాని ఖరీదు అక్షరాల 12 కోట్లు