Reserve Bank Of India: ప్రజల అవసరాలకు తగిన విధంగా చిన్న నోట్లను అందుబాటులో ఉంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయించింది. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఇకపై ఏటీఎం సెంటర్లలో రూ. 2000, రూ. 500 నోట్లు మాత్రమే కాకుండా, రూ. 200, రూ. 100 నోట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. సామాన్య ప్రజలు రోజువారీ అవసరాల కోసం రూ. 100, రూ. 200 నోట్లే వాడుతున్నారని, అయినప్పటికీ ఏటీఎం సెంటర్లలో రూ. 500, రూ. 2000 నోట్లు మాత్రమే అందుబాటులో ఉంచడం కరెక్ట్ కాదని వెల్లడించింది. ఇకపై అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు చిన్న నోట్ల మొత్తాన్ని దశల వారీగా పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. “సామాన్య ప్రజలు ఎక్కువగా ఉపయోగించే నోట్ల లభ్యతను పెంచాలని నిర్ణయించాం. అందులో భాగంగానే అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, తమ ఏటీఎంలలో రూ. 100, రూ. 200 నోట్లను కచ్చింతగా ఉంచాలి” అంటూ అన్ని బ్యాంకులకు పంపించిన సర్క్యులర్ లో స్పష్టం చేసింది.
సెప్టెంబర్ నాటికి ఏటీఎంలలో 75 శాతం చిన్ననోట్లు
తాజాగా ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు దేశంలోని అన్ని ఏటీఎంలలో కనీసం 75 శాతం ఏటీఎంలు ఒక క్యానెస్ ద్వారా అయినా రూ. 100, రూ. 200 నోట్లు తప్పని సరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది. మార్చి 2026 నాటికి ఈ పరిమితి 90 శాతానికి పెంచాలని ఆదేశించింది.
ఏటీఎంలలో రూ. 500, రూ. 2000 నోట్లు
గత కొంతకాలంగా ఏటీఎం సెంటర్లలో కేవలం రూ. 500, రూ. 2000 నోట్లే కనిపిస్తున్నాయి. రూ. 100, రూ. 200 నోట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రూ. 500 కంటే తక్కువ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఒకవేళ పెద్ద నోట్లు విత్ డ్రా చేసుకుంటే చిల్లర లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయం సామాన్యలకు ఎంతో ఊరట కలిగించే అవకాశం ఉంటుంది.
Read Also: 18 ఏళ్లు ఎయిర్ పోర్టులోనే బతికాడు, స్పీల్ బర్గ్ సినిమాకు ప్రేరణ అయ్యాడు.. చివరికి అక్కడే..
చిన్న నోట్లతోనే ఎక్కువ లావాదేవీలు
సామాన్య ప్రజలు ఎక్కువగా చిన్న నోట్లతోనే లావాదేవీలు జరుపుతారు. పాలు, పండ్లు, కూరగాయలు లాంటి నిత్యవసరాలను కొనుగోలు చేసేందుకు చిన్న నోట్లు ఎక్కువగా ఉపయోగపడుతాయి. కానీ, ప్రస్తుతం ఎక్కువగా రూ. 500 నోట్లు చలామణిలోకి రావడంతో చిల్లర కష్టాలు మొదలయ్యాయి. డబ్బులు తీసుకోవడంతో పాటు వాటిని చిల్లరగా మార్చేందుకు కష్టపడాల్సి వస్తుంది. మొత్తంగా ఆర్బీఐ నిర్ణయంతో సామాన్యుల కష్టాలు తీరనున్నాయి. ఆయా బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన గడువు లోగా అన్ని ఏటీఎంలలోకి.. సామాన్యులకు అనుకూలమైన నోట్లు ఎక్కువగా మార్కెట్లోకి రానున్నాయి. చిల్లర ఇబ్బందులు లేకుండా లావాదేవీలు జరుపుకునే అవకాశం కలగనుంది.
Read Also: 4 రంగుల్లో ఇండియన్ పాస్ పోర్టులు, ఇది ఉంటే వీసా లేకుండానే విదేశాలకు వెళ్లొచ్చు!