Megastar Chiranjeevi on Shiva rajkumar : సినిమా ఇండస్ట్రీలో ఎవరి టైం అయినా కొంతకాలమే నడుస్తుంది. కానీ నాలుగు దశాబ్దాలు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగారు అంటే అది మామూలు విషయం కాదు. అది ఏ ఫిలిం ఇండస్ట్రీ అయినా కూడా ఒక అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. స్వయం కృషితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవిని చూసి చాలామంది తెలుగు సినిమా పరిశ్రమ వైపు ముందడుగు వేశారు. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి అచీవ్ చేసిన సక్సెస్ మామూలుది కాదు. అయితే పదేళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా మళ్లీ ఎంట్రీ ఇస్తే అదే ఆదరణ మెగాస్టార్ చిరంజీవికి లభించింది. దీనిని బట్టి మెగాస్టార్ చరిష్మా ఏంటో అందరికీ అర్థం కావాలి.
శివరాజ్ కుమార్ కు అభినందనలు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతటి క్రేజ్ ఉందో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ కి కూడా అంతటి క్రేజ్ ఉంది. అందుకే చాలామంది ముద్దుగా ఆయనను శివన్న అని పిలుచుకుంటారు. అన్నా అనే పిలుపు అంత మామూలుగా రాదు. కేవలం కన్నడ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ప్రతి ఇండస్ట్రీలోనూ శివరాజ్ కుమార్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికి కారణం ఆయన చేసిన సినిమాలు తో పాటు ఆయన వ్యక్తిత్వం కూడా. శివ రాజ్‌కుమార్ సినిమా నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత గా మంచి పేరును సాధించారు. ఆయన కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు. కన్నడ సినీరంగంలో ‘శివన్న’గా గుర్తింపునందుకొని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సినిమా పురస్కారం, ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, సైమా అవార్డ్స్ తో పాటు అనేక అవార్డులను అందుకున్నాడు.
40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు
ఇక ఫిలిం ఇండస్ట్రీలో శివరాజ్ కుమార్ 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన అభినందనలు తెలియజేశారు. శ్రీ రాజ్ కుమార్ గారు నాకు ఫాదర్ లాంటివారు. ఆయన సూపర్ స్టార్ కంటే కూడా ఒక డెమి గాడ్. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మంచి సక్సెస్ సాధించారు శివరాజ్ కుమార్. శివన్న, అప్పు మరియు రాఘవేంద్ర నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటివాళ్ళు. శివన్న స్టార్ గా ఎదిగిన తీరు నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అంటూ పలు మాటలు చెప్పుకొచ్చారు. ఇకపోతే శివన్న ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఒక కీలకపాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
Megastar @KChiruTweets extends heartfelt wishes to @NimmaShivanna on completing 40 glorious years in cinema! ❤️
A journey marked by dedication, passion, and iconic performances. Here's wishing many more milestones ahead! 💐 #DrShivarajkumar #Shivanna40 #PEDDI pic.twitter.com/fFNaF3mRZT
— BA Raju's Team (@baraju_SuperHit) June 10, 2025