BigTV English

Vijay Mallya – RCB: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విజయ్ మాల్యా చేతిలోకి మళ్ళీ RCB?

Vijay Mallya – RCB: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విజయ్ మాల్యా చేతిలోకి మళ్ళీ RCB?

Vijay Mallya – RCB : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ( RCB Team ) ఐపీఎల్ 2025 సీజన్ లో ( Ipl 2025) ట్రోఫీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రోఫి విజయం సాధించడంతో అభిమానులు సంబురాలు చేసుకోవడం.. ఈ సంబురాల్లో భాగంగా ఈ టీమ్ చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాటలో 11 మంది మృతి చెందడం   దురదృష్టకరం. ఇప్పటి వరకు 17 టైటిల్స్ గెలిచినది ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఆర్సీబీ 18వ సీజన్ లో టైటిల్ గెలిచిన విధానం మరో ఎత్తుగా కనిపిస్తోంది. ఒకేసారి ఇంత మంది అభిమానులు రావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు భద్రతా వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాలి. వాస్తవానికి విజయ్ మాల్యా చేతిలోకి మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీయాలో కనిపించడం విశేషం. 


Also Read: Luckiest Batter: అదృష్టమంటే ఇదే…వికెట్లను తాకినా నాటౌటే.. అది కూడా 98 పరుగుల వద్ద

మరోవైపు ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచిన సందర్భంలో.. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి. వాస్తవానికి విజయ్ మాల్యా 2008 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పుడు ముంబై ఇండియన్స్ జట్టు కోసం బిడ్ వేశాడు. అయితే అంబానీ ముంబై ఇండియన్స్ జట్టు ని దక్కించుకున్నాడు. వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టును తొలి సీజన్ లో విజయ్ మాల్యా కొనుగోలు చేయాలని భావించాడట. అయితే అయితే అప్పటికే అంబానీ కూడా బిడ్ వేయడంతో అధిక ధరకు కొనుగోలు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేశాడు విజయ్ మాల్యా. ఒకవేళ విజయ్ మాల్యా ముంబై జట్టును కొనుగోలు చేస్తే.. మాత్రం రాయల్ ఛాలెంజర్స్ ముంబై అని నామకరణం చేయాలని భావించాడట. ప్రస్తుతం విజయ్ మాల్యా చేసిన కామెంట్స్ వైరల్ కావడం ఒక విశేషం అయితే.. మరోవైపు ఆర్సీబీని మళ్లీ విజయ్ మాల్యా చేతిలోకి వెళ్లనుందని వార్తలు వినిపించడం విశేషం.


Also Read:Rohit’s Lamborghini: రోహిత్ శర్మకు అవమానం…గిఫ్ట్ గా ఇచ్చిన కారును అమ్ముకున్న ఫ్యాన్ June 9,2 

అసలు విజయ్ మాల్యా ఇండియా కి వచ్చేదెప్పుడు..? ఆర్సీబీ జట్టును దక్కించుకునేది ఎప్పుడు..? అని అందరూ చర్చించుకోవడం గమనార్హం. బ్యాంకులో తీసుకున్న లోన్లు చెల్లించలేకనే విజయ్ మాల్యా విదేశాల్లో తల దాచుకున్నాడు. ఇప్పుడు ఇండియా కి వస్తే.. కచ్చితంగా అరెస్ట్ చేస్తారని కొందరూ అంటుంటే..? డబ్బున్నోడు ఎక్కడున్నా దొరలా ఉంటాడు. డబ్బుతో దేనిని అయినా కొనుగోలు చేయవచ్చు. అప్పటివరకు ఏమైనా జరగవచ్చు అని రకరకాలుగా కామెంట్స్ చేయడం విశేషం. ఇక రాయల్ ఛాలెంజర్స్ జట్టు విజయం సాధించడంతో 18 సంవత్సరాల తరువాత విజయం సాధించామని విరాట్ కోహ్లీ స్టేడియంలోనే కంట తడి పెట్టాడు. అది చూసిన అభిమానులు కూడా ఎమోషనల్ కావడం విశేషం.

 

 

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×