Megastar Chiranjeevi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ స్టార్ హీరోలలో మొదటి వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి. గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని మెగాస్టార్ చిరంజీవి శాసిస్తున్న సంగతి తెలిసిందే. ఒక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి పాలిటిక్స్ కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిన విషయమే. అయితే మెగాస్టార్ కి రాజకీయాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చాలామంది ఊహించారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఎక్కువకాలం రాజకీయాల్లో నిలబడలేక పోయారు. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీయంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత చేసిన అన్ని సినిమాలు కంటే వాల్తేరు వీరయ్య ఒక మెట్టు పైన ఉంటుంది అని చెప్పాలి.
మళ్లీ బాబీకి అవకాశం
వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. బాబీ ఈ సినిమాను డీల్ చేసిన విధానం చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. మెగాస్టార్ చిరంజీవిని ఎలా అయితే చూడడానికి అభిమానులు ఇష్టపడతారు అలానే చూపించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక మరోసారి మెగాస్టార్ చిరంజీవి బాబికి అవకాశం ఇవ్వనన్నట్లు తెలుస్తుంది. సినిమాకు సంబంధించిన కథ చర్చలు కూడా జరిగిపోయాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ కి వెళ్ళనున్నారు. ఇక మెగాస్టార్ కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా మరో రెండు సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు.
అనిల్ రావిపూడి కాంబినేషన్
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కేవలం యంగ్ దర్శకులకు మాత్రమే అవకాశాలు ఇస్తున్నారు. కొత్త దర్శకులు తనను ఎంత కొత్తగా చూపిస్తారు అని మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అని విశ్వసినీ వర్గాల సమాచారం. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ని అనిల్ రావిపూడి ఈ సినిమాతో బయటికి తీస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. ఇక అనిల్ రావిపూడి విషయానికి వస్తే ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అనిల్ స్ట్రెంత్ కామెడీ. మెగాస్టార్ లాంటి హీరోతో ఎలాంటి కామెడీ జనరేట్ చేస్తాడు అని చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంది.
Also Read : Rajinikanth : దారి తప్పుతున్నారు… యువతపై సూపర్ స్టార్ కామెంట్స్ వైరల్