OTT Movie : ఓటీటీలో ఎన్నో జానర్ల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అందులో రొమాంటిక్, సస్పెన్స్, హర్రర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఈరోజు మన మూవీ సజెషన్ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్. ఈ సినిమాలో తన దగ్గరకొచ్చిన పేషెంట్ తో లేడీ డాక్టర్ క్లోజ్ అవుతుంది. అంతేకాదు క్లైమాక్స్ ట్విస్ట్ బుర్ర బద్దలే అన్నట్టుగా ఉంటుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? కథ ఏంటో తెలుసుకుందాం పదండి.
కథలోకి వెళ్తే…
క్లైర్ సమ్మర్స్ (అన్నే హాతవే) ఒక సైకోథెరపిస్ట్. ఆమె తన మెంటార్ పెర్రీ (ఆండ్రీ బ్రాగర్) సలహాతో ఒక విమాన ప్రమాదం నుండి బయటపడిన ఐదుగురు సర్వైవర్‌లకు కౌన్సెలింగ్ ఇస్తుంది. ఆ సర్వైవర్‌ల పేర్లు డీన్, నార్మన్, షానన్, ఎరిక్ (పాట్రిక్ విల్సన్), ఫ్లైట్ అటెండెంట్ జానిస్. విమాన ప్రమాదం తర్వాత క్లైర్ ఈ ఐదుగురు సర్వైవర్‌లతో గ్రూప్ థెరపీ సెషన్‌లు నిర్వహిస్తుంది. అయితే ఎరిక్ మాత్రం గ్రూప్ సెషన్‌లకు రాకుండా, క్లైర్‌ను వ్యక్తిగతంగా కలవమని కోరతాడు. ఎరిక్ ఈ దుర్ఘటన తర్వాత మరింత ఉత్సాహంగా కనిపిస్తాడు. ఇది క్లైర్‌కు అనుమానం కలిగిస్తుంది. అంతేకాక, అతను క్లైర్ గురించి వ్యక్తిగత విషయాలు తెలుసుకుంటాడు. ఇది ఆమెను మరింత ఆశ్చర్యపరుస్తుంది.
ఇక సర్వైవర్‌లు ప్రమాదం గురించి తమ జ్ఞాపకాలను ఒక్కొక్కరూ డిఫరెంట్ గా చెబుతారు. డీన్ ప్రమాదానికి ముందు ఒక పేలుడు జరిగిందని చెబుతాడు. కానీ ఎయిర్‌లైన్ అధికారి మిస్టర్ ఆర్కిన్ (డేవిడ్ మోర్స్) దాన్ని ఖండిస్తూ, పైలట్ లోపం వల్ల ప్రమాదం జరిగిందని పేర్కొంటాడు. ఈ విభేదాలు క్లైర్‌లో కొత్త కొత్త అనుమానాలు రేకెత్తిస్తాయి. ఇక క్లైర్ ఎరిక్‌తో సన్నిహితంగా మెలుగుతుంది. ఇది తన వృత్తి ధర్మానికి విరుద్ధం అయినప్పటికీ, వారిద్దరూ ప్రేమలో పడతారు. అదే సమయంలో సర్వైవర్‌లు ఒక్కొక్కరూ అదృశ్యమవుతుంటారు.
క్లైర్ ఎయిర్‌లైన్ కుట్రలో భాగంగా సర్వైవర్‌లను సైలెంట్ చేయడానికి ప్రయత్నిస్తోందని అనుమానిస్తుంది. ఆమె మిస్టర్ ఆర్కిన్‌ను నమ్మదు. ఒక గుర్తు తెలియని వ్యక్తి సర్వైవర్‌లను వెంబడిస్తున్నట్లు గమనిస్తుంది. ఆమె సూపర్‌వైజర్ ఆమెను ఇదంతా నమ్మొద్దని హెచ్చరిస్తాడు. కానీ క్లైర్ మాత్రం నిజమేంటో కనిపెట్టాలని నిర్ణయించుకుంటుంది.
ఒక రోజు ఆర్కిన్ బ్రీఫ్‌కేస్‌లో ఒక లెడ్జర్‌ను వదిలివేస్తాడు. అందులో ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల లిస్ట్ ఉంటుంది. ఆ జాబితాలో క్లైర్ పేరు కూడా ఉంటుంది. ఆర్కిన్ పైలట్ అని ఆ లిస్ట్ లో ఉండడం క్లైర్‌ను గందరగోళానికి గురి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే క్లైర్ ఎరిక్‌ను అతని బోట్‌లో కలుస్తుంది, అక్కడ అతను ఒక షాకింగ్ నిజాన్ని వెల్లడిస్తాడు. ఆ నిజం ఏంటి? అసలు విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న పాసెంజర్స్ అంతా ఎలా మిస్ అవుతున్నారు? ఈ మిస్టరీ వెనకున్న సీక్రెట్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.
Read Also : మసాజ్ కోసం వెళ్తే కాటికే పంపించే చైర్… ఈ మూవీని చూస్తే చచ్చినా ఇంకోసారి మసాజ్ చైర్ లో కూర్చోరు
ఓ ఓటీటీలో అందుబాటులో ఉందంటే?
ఈ సైకలాజికల్ డ్రామా పేరు “Passengers”. 2008లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను రొడ్రిగో గార్సియా డైరెక్ట్ చేశారు. అన్నే హాతవే, పాట్రిక్ విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.