Maas Jathara:మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఒకప్పుడు వరుస సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ.. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి, ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో గ్రూప్ లో ఒక వ్యక్తిగా నటించి అలరించిన ఈయన బ్రహ్మాజీ హీరోగా నటించిన ‘సింధూరం’ సినిమాతో సెకండ్ హీరోగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘నీకోసం’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన రవితేజ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. తన సినిమాలలో కామెడీని పండిస్తూనే.. మరొకవైపు మాస్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ దూసుకుపోతున్నారు.
మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ..
ఇదిలా ఉండగా ఇప్పుడు రవితేజ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూ.. తాజాగా 75వ చిత్రంగా రాబోతున్న చిత్రం ‘మాస్ జాతర’. ఇందులో శ్రీ లీల (Sree Leela) మరోసారి రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కి భాను భోగ వరపు (Bhanu Bhogavarapu) దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా వారం క్రితమే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు.” తూ మేరా లవర్ ” అంటూ సాగే ఈ పాటను ప్రముఖ దివంగత సంగీత దర్శకుడు చక్రి (Chakri ) ఏఐ వాయిస్ తో క్రియేట్ చేయడం జరిగింది. అంతేకాదు పూరీ జగన్నాథ్ (Puri Jagannath)దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్ ‘ సినిమాలోని ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే జాన్ ” అనే పాట ఐకానిక్ స్టెప్ ను కూడా ఇక్కడ రీ క్రియేట్ చేశారు.
అక్కడే షూటింగ్.. 80 శాతం పూర్తి..
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ముచ్చింతల్ లో జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగు పూర్తయినట్లు సమాచారం. ఇక మిగిలిన 20 శాతం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ కోసం రవితేజ చాలా ఆత్రుతగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన సక్సెస్ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే మే 9వ తేదీన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ డేట్ ప్రకటించారు. ఇంకా 20% షూటింగ్ పెండింగ్ లో ఉందిm మరి అనుకున్న సమయానికి ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తారో లేదో చూడాలి. ఇకపోతే ఈ చిత్రానికి బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తూ ఉండగా .. సినిమా ఆటోగ్రఫీ గా విధు అయ్యన్న, ఎడిటర్ గా నవీన్ నూలి పని చేస్తున్నారు.
Also Read:Pawan Kalyan : OG మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్… ఇక పవన్ కళ్యాణ్‌దే ఆలస్యం..