Hyderabad MLC election: 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ, ఎంఐఎం పోటీపడుతున్నాయి. ఓ వైపు మజ్లిస్ కు మొగ్గు ఉన్నా.. విజయం మాత్రం తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. అయితే ఎంఐఎం వర్సెస్ బీజేపీ పోరులో ఫలితం ఎలా ఉండబోతుంది..? ఎంఐఎంను అడ్డుకునేందుకు బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది..? అన్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ గా మారింది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోగా.. ఎన్నికల్లో పార్టీ వైఖరిపై రాజకీయ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ అనూహ్యంగా అభ్యర్థిని బరిలో దింపింది. గౌతం రావును పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ఈ ఎన్నిక ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 23 న జరగనున్న ఎన్నికలకు మొత్తం 112 మంది ఓటర్లుగా ఉన్నారు. అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా.. తర్వాత స్థానంలో బీజేపీకి ఉంది. ఎంఐఎంకు 49 ఓట్లు ఉన్నాయి. అయితే ఈ ఓట్లతో ఇతర పార్టీల మద్దతుపై ఎంఐఎం నమ్మకం పెట్టుకుంది. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీని బరిలో ఉన్నారు.
బీజేపీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదే విజయం అనే ధీమాతో ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 112. ఇందులో 81 మంది కార్పొరేటర్లు ఉండగా.. 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్‌కు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు 9 చొప్పున ఉండగా.. కాంగ్రెస్‌కు 7, బీజేపీకి ఆరు ఓట్లు ఉన్నాయి.
అయితే, హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల వేల బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. హిందువుల పేరుతో ఈ బ్యానర్లు వెలిశాయి. హైదరబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలంటూ బ్యానర్లలో రాసి ఉంది. MIMకు ఎట్టిపరిస్థితుల్లో ఓటు వేయొద్దంటూ.. అంటూ ఫ్లెక్సీ లో ఉంది. ఓటింగ్ లో పాల్గొని MIM వ్యతిరేకంగా ఓటు వేయాలని బ్యానర్లలో తెలిపారు. తమకు ఓటు వేయకుంటే హిందూ ద్రోహులు అంటూ నగరంలోని పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలిశాయి.
Also Read: OFMK Recruitment: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జాబ్స్.. ఈ అర్హత ఉండే ఎనఫ్.. పూర్తి వివరాలివే..