BigTV English

Suresh Kondeti: వివాదాస్పద జర్నలిస్ట్ హీరో అయ్యాడు.. సినిమా టైటిల్ ఏంటో తెలుసా.. ?

Suresh Kondeti: వివాదాస్పద జర్నలిస్ట్ హీరో అయ్యాడు.. సినిమా టైటిల్  ఏంటో తెలుసా.. ?

Suresh Kondeti: వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే డైరెక్టర్స్ లో రామ్ గోపాల్ వర్మను చూపిస్తారు.. జర్నలిస్ట్స్ లో అయితే సురేష్ కొండేటి అని చెప్పుకొచ్చేస్తారు. ప్రెస్ మీట్ లకు వచ్చిన స్టార్స్ ను తన ప్రశ్నలతో చిరాకు తెప్పించి.. తాను అనుకున్న ఆన్సర్ వచ్చేవరకు ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు. హీరోయిన్స్ సైతం  జవాబు చెప్పడానికి  ఇబ్బంది పడే ప్రశ్నలు అడిగి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటాడు. అలా విమర్శల పాలై కొన్ని నెలలు ప్రెస్ మీట్లకు కూడా దూరమయ్యాడు


ఇక ఇదంతా పక్కన పడితే.. సురేష్ కొండేటి హీరోగా మారాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న  చిత్రం అభిమాని. ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ అనేది ట్యాగ్ లైన్. రాంబాబు దోమకొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎస్‍కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా.. ఫస్ట్ గ్లింప్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రిలీజ్ చేశారు. ఈ రెండింటికి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఇక ఈ సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

తాజాగా నేడు  సురేష్ కొండేటి, మణిశర్మ ఇంటికి వెళ్లి కలవడం జరిగింది. ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ .. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా సోషల్ మెసేజ్ తో తెరకెక్కిన అభిమాని మూవీకి అంతే గొప్పగా నేపథ్య సంగీతం కుదిరింది. సురేష్ కొండేటి ఈ సినిమాలో బాగా నటించారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది.


సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడని అనుకుంటున్నాను. డైరెక్టర్ కూడా ఎంతో బాగా సినిమాను తెరకెక్కించాడు. అభిమాని మూవీని మీరంతా ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు.

Sobhita Dhulipala: అక్కినేని పెద్ద కోడలి మొదటి సంక్రాంతి.. అవి లేకుండానా ఛీఛీ.. ?

ఇక సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి అందరికీ కొత్త వెలుగును ఇవ్వాలి. అలాగే నాకు ఈ సంక్రాంతి ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశ‌ర్మ‌ గారు నా సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. దాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. మణిశర్మ అనేది పేరు కాదు, ఓ బ్రాండ్. ఎన్నో మంచి సినిమాలు ఆయన సంగీతం వల్లే బ్లాక్ బస్టర్ సినిమాలు అయ్యాయి.

ఇంద్ర, చూడాలనివుంది, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు ఇలాంటి సినిమాల గురించి మాట్లాడినప్పుడల్లా మణిశర్మ గారి మ్యూజిక్ గురించే మాట్లాడుకుంటారు. వెంకటేష్, నాగార్జున , పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ అందరికీ ఆయన బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు నా అభిమాని సినిమాకు ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ఇవ్వడం ఆనందం కలిగిస్తోంది. చిన్నతనం నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాను. అంతటి మెలోడీ బ్రహ్మ నా సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం  నాకు ఎంతో సంతోషంగా ఉంది. రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది.

నా సినిమా కోసం పనిచేసినందుకు మణిశర్మ గారికి థాంక్స్ చెప్తున్నాను. ఇప్పటిదాకా నన్ను సినీ జర్నలిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా కూడా అభిమాని సినిమాతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో సురేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×