Sobhita Dhulipala: అక్కినేని ఇంట పెద్ద కోడలిగా అడుగుపెట్టింది శోభితా దూళిపాళ్ల. అక్కినేని నాగ చైతన్య, సమంతకు విడాకులు ఇచ్చాకా.. నటి శోభితాను రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. గతేడాది డిసెంబర్ 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. పెళ్ళికి ముందు శోభితా ఎలా ఉండేది అనేది అందరికీ తెల్సిందే. పుట్టింది తెనాలిలో అయినా.. అమ్మడు పెరిగింది మొత్తం ముంబైలోనే. అక్కడే ఆమె తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంది.
ఇక గ్లామర్ పాత్రలు, ఇంటిమేటెడ్ పాత్రలు చేయడంలో శోభిత బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. ఇక ఎప్పుడైతే అక్కినేని కోడలిగా మారుతుందని అధికారికంగా తెలిపారు.. అప్పటినుంచి శోభితా డ్రెస్సింగ్ లో చాలా మార్పులే వచ్చాయి. అంతేనా ఆమె పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అచ్చ తెలుగు సాంప్రదాయాలను అన్ని పాటించి పెళ్లి చేసుకుంది. పసుపు దంచడం నుంచి పెళ్లి వరకు ఎక్కడా గ్లామర్ కు తావు ఇవ్వకుండా.. పాత పద్దతిలో పెళ్లి కూతురుగా ముస్తాబు అయ్యి, చై చేత మూడు ముళ్లు వేయించుకుంది.
Sankranthi 2025: స్టార్ల సంక్రాంతి.. ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే.. ?
అన్ని సాంప్రదాయాలను పాటించి పెళ్లి చేసుకుంది అంటే.. పెళ్లి తరువాత కూడా ఈ చిన్నది ఇలాగే ఉంటుంది అనుకున్నారు. కానీ, కొన్నిరోజులకే శోభితా.. అదంతా కేవలం పెళ్లి వరకే పరిమితమని రుజువుచేసింది. నేడు సంక్రాంతి. పెళ్లి తరువాత అక్కినేని కోడలిగా శోభితా జరుపుకుంటున్న మొదటి సంక్రాంతి. ఈరోజు ఇద్దరు భార్యాభర్తలు సాంప్రదాయబద్దంగా ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించారు. శోభితా నిండుగా చీర కట్టుకొని కనిపించగా.. చై వైట్ అండ్ వైట్ కుర్తాలో దర్శనమిచ్చినట్లు తెలుస్తోంది.
శోభితా రెడ్ కలర్ చీరలో మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. దీంతో పాటు చై, శోభితా కాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ తమ ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడే ఆమె దొరికిపోయింది. పెళ్లి అయ్యి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. శోభితా తన కాళ్లకు మెట్టెలను తీసేసి కనిపించింది. ఈ విషయాన్నీ నెటిజన్స్ కనిపెట్టేశారు. పెళ్ళిలో శోభితా..చై మెట్టెలు పెట్టేటప్పుడు ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు అవి తీసేసి కనిపించింది. ఇక దీంతో ఆమెపై మండిపడడం మొదలుపెట్టారు.
పెళ్లి రోజు అంత సాంప్రదాయంగా ఉన్నావు.. మరి ఈ సాంప్రదాయాలు తెలియవా.. ? కాలికి మెట్టెలు తీయకూడదు అన్న విషయం తెలియదా.. ? పోనీ రోజు తీసేసినా.. ఈరోజు పండగ.. భర్తతో కలిసి పూజ చేస్తావ్ కదా.. కనీసం ఈరోజైనా పెట్టుకోవచ్చుగా.. ఛీఛీ ఏంటో ఆమె అని ఏకిపారేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం శోభితాకు సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఎవరిష్టం వారిది.. వారికి లేని బాధ మీకెందుకు అని చెప్పుకొస్తున్నారు. ఇక శోభితా మొదటి సంక్రాంతి కాబట్టి.. చై అత్తవారింటికి వెళ్లినట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.