Suzhal 2 Trailer: ఐశ్వర్య రాజేష్.. సీనియర్ నటుడు రాజేష్ నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా కూడా.. ఇక్కడ అంతగా ఆమెను ఎవరు గుర్తించకపోవడంతో తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసి.. అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యం పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఏ స్టార్ హీరోయిన్ కూడా ఈ పాత్రకు ఒప్పుకోకపోతే దైర్యం చేసి.. చిన్న వయస్సులోనే నాలుగు పిల్లలకు తల్లిగా ఆమె నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తరువాత ఐశ్వర్య రాజేష్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కన్నా ముందు ఐశ్వర్య రాజేష్ సుడల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అమెజాన్ ఒరిజనల్ సిరీస్ గా తెరకెక్కిన సుడల్ మంచి విజయాన్ని అందుకుంది. ఐశ్వర్య రాజేశ్, గోపిక రమేష్, కథిర్, ఆర్. పార్థిబన్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ కు పుష్కర్ – గాయత్రి దర్శకత్వం వహించారు.
2022లో విడుదలైన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిన ఈ సిరీస్ కు రెండేళ్ల తరువాత సీక్వెల్ ప్రకటించారు. సుడల్.. ది వోర్టెక్స్ సీజన్ 2 రానుందని మేకర్స్ ప్రకటించారు.
ఇక తాజాగా సుడల్.. ది వోర్టెక్స్ సీజన్ 2 ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ను బట్టి ఈ స్టోరీ మొత్తం మారినట్లు తెలుస్తోంది. సీజన్ 1 లో ఐశ్వర్య రాజేష్ మీదనే సిరీస్ మొత్తం నడిచింది. సీజన్ చివర్లో ఐశ్వర్యనే అన్ని హత్యలు చేస్తుందని తెలిసి ఆమెను అరెస్ట్ చేస్తారు. ఇక సీజన్ 2 లో ఆమెను కోర్టు లో హాజరుపర్చడం.. ఐశ్వర్యను బయటకు తీసుకురావడానికి ఆమె స్నేహితుడు, పోలీస్ అయిన కథిర్ కష్టపడడం ఈ ట్రైలర్ లో చూపించారు.
Chiranjeevi – Anil Ravipudi: అనిల్ రావిపూడికి జాక్‌పాట్.. చిరు మూవీకి ‘మెగా’ రెమ్యునరేషన్!
ఐశ్వర్యను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న లాయర్ ను సడెన్ గా ఎవరో చంపేస్తారు. అతనిని చంపింది మొత్తం 8 మంది ఆడవారిని గుర్తిస్తారు. అసలు ఆ 8 మంది ఆడవారు లాయర్ ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. ? అసలు లాయర్ ను చంపింది ఎవరు .. ? వీరికి, ఐశ్వర్యకు సంబంధం ఏంటి.. ? చివరికి ఐశ్వర్య బయటకు వస్తుందా..? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక ఈసారి ఈ సీజన్ మరింత థ్రిల్లింగ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఐశ్వర్య కన్నా ఈ సిరీస్ లో 96 ఫేమ్ గౌరీ జి కిషన్ పై ఫోకస్ వెళ్ళింది. ఆమెనే ఈ సిరీస్ లో ప్రధాన పాత్రగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మంజిమా మోహన్, ‘కయల్’ చంద్రన్, సంయుక్త వియోలా విశ్వనాథన్, మోనిషా బ్లెస్సీ, రిని, శ్రీషా, అభిరామి బోస్, నిఖిలా శంకర్, కలైవాణి ఇలా యంగ్ హీరోయిన్స్ అందరూ ఈ సిరీస్ లో కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ తో ఐశ్వర్య రాజేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.