E-Paper
Advertisement

Actress : డ్రంకెన్ డ్రైవ్ కేసుతో కెరీర్ నాశనం… 24 ఏళ్ల వయసులో హీరోయిన్ అనుమానాస్పద మృతి

Actress : డ్రంకెన్ డ్రైవ్ కేసుతో కెరీర్ నాశనం… 24 ఏళ్ల వయసులో హీరోయిన్ అనుమానాస్పద మృతి
Advertisement

Actress : నటీనటుల కెరీర్ కొన్ని వివాదాల కారణంగా మధ్యలోనే నాశనం అవ్వడం ఇప్పటికే ఎన్నోసార్లు చూశాము మనం. కానీ ఇటీవల కాలంలో మితిమీరిన సోషల్ మీడియా ట్రోలింగ్, కామెంట్స్ సెలబ్రిటీల మెంటల్ హెల్త్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్లే ఓ యువ నటి తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.

కొరియన్ నటి అనుమానాస్పద మృతి 

Advertisement

దక్షిణ కొరియా నటి కిమ్ సే-రాన్ (Kim Sae-ron) ఆదివారం మరణించారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె వయసు కేవలం 24 సంవత్సరాలే కావడం విచారకరం. 2010 లో రిలీజ్ అయిన ‘ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్’ (The Man from Nowhere) మూవీతో ఈ హీరోయిన్ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. కిమ్ ఓ స్నేహితుడిని కలిసిన తర్వాత, సియోల్ లో చనిపోయి కన్పించడం అనుమానాస్పదంగా మారింది. పోలీసులు ఆమె చనిపోయింది అన్న విషయాన్ని కన్ఫామ్ చేశారు. అయితే ఆమె మరణానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు.

కిమ్ సినిమా కెరీర్ 

Advertisement

2000 సంవత్సరంలో సియోల్‌లో జన్మించిన కిమ్, 9 సంవత్సరాల వయసులో బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. సమాచారం ప్రకారం 2009 లో రిలీజ్ అయిన ‘ఎ బ్రాండ్ న్యూ లైఫ్’లో తన పాత్ర కోసం కేన్స్‌కు ఆహ్వానం అందుకున్న అతి చిన్న వయస్కులలో ఆమె కూడా ఒకరు. ఆ తర్వాత కిమ్ అనేక చిత్రాలతో నటించింది. ఆ లిస్ట్ లో ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్, ది నైబర్, ఎ గర్ల్ ఎట్ మై డోర్, స్నోవీ రోడ్, ది విలేజర్స్, టీవీ సిరీస్ మిర్రర్ ఆఫ్ ది విచ్ వంటి సూపర్ హిట్ కొరియన్ డ్రామాలు ఉన్నాయి.

ఆమె ‘ఎ బ్రాండ్ న్యూ లైఫ్’, ‘ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్’, ‘ఎ గర్ల్ ఎట్ మై డోర్’, ‘స్నోవీ రోడ్’,  ‘మిర్రర్ ఆఫ్ ది విచ్’ చిత్రాలలో తన పాత్రలకు అనేక అవార్డులను గెలుచుకుంది. అయితే 2022లో మద్యం సేవించి వాహనం నడుపుతూ కేసులో చిక్కుకుంది. ఆ వివాదమే కిమ్ సినీ జీవితాన్ని నాశనం చేసింది.

సోషల్ మీడియా, మీడియా వేధింపులు 

కిమ్ తన కారును సియోల్‌ లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ కు ఢీకొట్టడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ టైమ్ లో ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు తేలింది. దీంతో కిమ్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం మాత్రమే కాదు మిలియన్ వోన్ ($13,850) ఫైన్ విధించారు. ఈ సంఘటన ఆమె సినిమా అవకాశాలను కోల్పోవడానికి దారి తీసింది. అయితే పరిస్థితులు అక్కడితో ఆగలేదు.

దక్షిణ కొరియాలో మద్యం తాగి వాహనం నడపడాన్ని అతిపెద్ద నేరంగా భావిస్తారు. అందుకే కిమ్ తీవ్ర ట్రోలింగ్ కు గురయ్యారు. ఆమె నవ్వినా విమర్శలు వచ్చే స్థాయిలో నెగెటివ్ కామెంట్స్ వచ్చేవి. ఆమె చివరిసారిగా 2023లో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘బ్లడ్‌ హౌండ్స్‌’లో కనిపించింది. ఇక ఆ తరువాత కిమ్ కు అవకాశాలు పూర్తిగా కరువయ్యాయి.

కిమ్ చివరి సినిమా ఇదే 

ఇప్పుడిప్పుడే కిమ్ పేరు మార్చుకుని, సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆలోచిస్తోందని సమాచారం. ఆమె నవంబర్‌లో ‘గిటార్ మ్యాన్’ చిత్రం షూటింగ్‌ను కూడా పూర్తి చేసింది, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అంతలోనే ఆమె అకాల మరణం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా కిమ్ అభిమానులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×