BigTV English

Russia Ukraine War : రష్యాకు ఉక్రెయిన్ ఊహించని షాక్.. ఏకంగా ఆ ప్రాంతంపైకి డ్రోన్ల దండు.. భారీ నష్టం

Russia Ukraine War : రష్యాకు ఉక్రెయిన్ ఊహించని షాక్.. ఏకంగా ఆ ప్రాంతంపైకి డ్రోన్ల దండు.. భారీ నష్టం

Russia Ukraine War : రష్యాలోని కజాన్ నగరంపై ఉక్రెయిన్ డ్రోనులతో విరుచుకుపడింది. కొన్నాళ్లుగా రష్యా చేస్తున్న భీకర దాడులకు ప్రతిగా ఉక్రెయిన్ తాజా దాడులు చేసింది. అమెరికాలోని ట్విన్ టవర్స్ పై 9/11 దాడుల తరహాలో రష్యాలోని కజన్ నగరంలోని ఎత్తైన బిల్డింగ్ లను డ్రోన్లతో ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. రష్యాని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశారు. అక్కడి నుంచి విమాన సర్వీసులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఈ దాడులపై అంతర్జాతీయంగా చర్చ నడుస్తోంది.


రష్యా రాజధాని మాస్కోకు 800 కిలోమీటర్ల దూరంలోని కజాన్ నగరాన్ని టార్గెట్ గా చేసుకుని ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు దిగింది. మానవరహిత డ్రోన్లతో నివాస సముదాయాలను లక్ష్యంగా చేసుకుని..  వాటిని పేల్చేసింది. దీంతో.. నగరంలోని ఆరు ఎత్తైన బిల్డింగులు దెబ్బతిన్నట్లు రష్యా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ దాడులు జరిగిన ప్రాంతానికి సమీపంలోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేస్తున్నట్లు  రష్యా ఏవియేషన్‌ వాచ్‌డాగ్‌ రోసావియాట్సియా ప్రకటించింది.

ఉక్రెయిన్ మానవరహిత డ్రోన్లల్లో చాలా వరకు కూల్చేశామని రష్యా ప్రకటించింది. నివాస సముదాయాలపై జరిగిన దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానిక అధికారులు తెలిపినట్లు అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి.


కొన్ని వారాల క్రితం దీర్ఘ శ్రేణి ఆయుధాలతో పాటు అత్యాధునిక ఆయుధాని వాడేందుకు బైడెన్ అనుమతించిన నేపథ్యంలో.. ఉక్రెయిన్ దళాలు సరిహద్దు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నాయి. శుక్రవారం నాడు ఉక్రెయిన్ దళాలు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంపై జరిపిన దాడుల్లో ఐదుగురు మరణించగా, పన్నేెండు మందికి గాయాలయ్యాయి. అలాగే.. కీవ్ లోని ఓ స్కూల్, పైలట్ ట్రైనింగ్ కాలేజీ హాస్టల్ పై దాడి చేసిన ఉక్రెయిన్ ఇందుకోసం.. హిమార్స్ రాకెట్లను వినియోగించినట్లు రష్యా పేర్కొంది. వీటి సాయంతోనే కీవ్ పై జరిపిన దాడిలో ఒక సైనికుడు చనిపోయినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి.

రష్యా నుంచి సైతం ఉక్రెయిన్ పైకి పెద్ద ఎత్తున డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఉక్రెయిన్ భూభాగం పైకి అర్థరాత్రి వేళ 57 రష్యన్ డ్రోన్‌లు దాడులకు దిగాయి. వీటిని అడ్డగించిన ఉక్రెయిన్ సైన్యం.. వాటన్నింటినీ నాశనం చేసినట్లు తెలిపింది. మరో 56 డోన్లు ఉక్రెయిన్ లోకి చొచ్చుకు వచ్చినా.. టార్గెట్లను తాకలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదే సమయంలో ఉక్రెయిన్ వైమానిక దళం కూడా రష్యా ప్రయోగించిన ఐదు ఇస్కాండర్ క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. కానీ.. వాటి శిథిలాలు పడడంతో పలు చోట్ల స్పల్ప నష్టం జరిగినట్లు తెలిపింది. రష్యా వైమానిక దాడులు మొదటి నుంచి  రాజధానిని లక్ష్యంగా చేసుకున్నప్పటికీ.. బలమైన కీవ్ వాయిసేన కారణంగా అనుకున్న మేర నష్టపరచలేకపోయినట్లు తెలిపింది.

Also Read :  మణిపూర్ మిలిటెంట్ల చేతిలో స్టార్ లింక్‌ ఇంటర్నెట్.. స్పందించిన ఎలన్ మస్క్..

అయితే.. రష్యా దాడుల్లో అర్జెంటీనా, పాలస్తీనా, నార్త్ మాసిడోనియా, పోర్చుగల్, మోంటెనెగ్రో, అల్బేనియా దౌత్య కార్యాలయాలు, ఇతర భవనాలకు నష్టం జరిగినట్లు ఉక్రేనియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×