BigTV English

Mogalirekulu Daya Died : మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ మృతి.. ఏం జరిగింది ?

Mogalirekulu Daya Died : మొగలిరేకులు సీరియల్ ఫేమ్ దయ మృతి.. ఏం జరిగింది ?
Mogali Rekulu Actor Pavitranath Died
Mogali Rekulu Actor Pavitranath Died

Mogali Rekulu Actor Pavitranath Died : మొగలిరేకులు.. ఈ సీరియల్ సూపర్ హిట్. ఈ సీరియల్ ప్రసారమయ్యే రోజుల్లో.. రాత్రైతే చాలు దీనికోసం టీవీలకు అంటుకుపోయేవారు. అంత ఇంట్రెస్టింగ్ గా, ప్రతి ఎపిసోడ్ ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. బుల్లితెరపై చక్రవాకం, మొగలిరేకులు సంచలనం సృష్టించాయి. డైరెక్టర్ మంజుల నాయుడు తీసిన ఈ సీరియల్స్ ను ఇప్పటికీ మరచిపోలేరు. 2003-2008 వరకూ చక్రవాకం, 2008-2013 వరకూ మొగలిరేకులు.. పదేళ్లపాటు ఈ సీరియల్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సీరియల్ లో నటించిన స్రవంతి, ఇంద్ర, ఇక్బాల్, దయ, సాగర్, ఆర్కే నాయుడు, శాంతి, మామి, వెన్నెల క్యారెక్టర్లను అంత తేలికగా మరచిపోలేరు. ఇప్పుడు ఈ సీరియల్స్ ను రిపీట్ లో వేస్తున్నా టీఆర్పీ తగ్గట్లేదంటే.. ఎంత ఆదరణ ఉందో చూడండి.


తాజాగా.. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ లో ఇంద్ర తమ్ముడిగా నటించిన పవిత్రనాథ్ (దయ) (Mogalirekulu Daya) మరణించారు. ఈ విషయాన్ని ఇంద్రనీల్ భార్య.. మేఘన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “పవి నువ్వు లేవన్న విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. మా జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వాడివి. నీ మరణవార్త విన్నాక.. అది నిజం కాకూడదని కోరుకున్నాను. అబద్ధమైతే బాగుండు అనుకున్నాం. కానీ నిజంగానే ఈ లోకాన్ని విడిచి వెళ్లావన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాం. నిన్ను ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్ బై చెప్పలేకపోయాం. నిన్ను చాలా మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి కలగాలి. నీ ఫ్యామిలీకి దేవుడు మరింత శక్తినివ్వాలి” అని ఇంద్రనీల్ వర్మ, మేఘనలు ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

Read More : ప్రీ వెడ్డింగ్ వేడుకకు బాయ్‌ఫ్రెండ్‌తో శ్రద్ధా కపూర్.. అది నిజమేనంటున్న నెటిజన్లు


వారి పోస్ట్ చూసిన మొగలిరేకులు ఫ్యాన్స్ షాక్ కు గురయ్యారు. దయ చనిపోవడం ఏంటి ? అసలేం జరిగింది ? ఎప్పుడు, ఎలా, ఎందుకు ఇలా జరిగింది ? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అతని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే.. పవిత్రనాథ్ ఎప్పుడు, ఎలా చనిపోయాడన్నది మాత్రం వాళ్లు పోస్ట్ లో చెప్పలేదు.

కొన్నాళ్లుగా పవిత్రనాథ్ వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రెండేళ్ల క్రితం అతని భార్య శశిరేఖ పవిత్రనాథ్ పై సంచలన ఆరోపణలు చేసింది. పవిత్రనాథ్ కు అమ్మాయిల పిచ్చి ఉండేదని, జాతకం పేరుతో వాళ్లని నేరుగా ఇంటికి తీసుకొచ్చేవాడని చెప్పారు. ఇదేమిటని అడిగితే తనను కొట్టేవాడని, తనను పెళ్లి చేసుకున్నాక కూడా మరో అమ్మాయితో 8 సంవత్సరాలు అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆరోపించింది. అంతేకాక.. మద్యం తాగి వచ్చి ప్రతిరోజూ టార్చర్ పెడతాడని, అతని కెరీర్ కు సంబంధించిన విషయాలేవీ తనకు చెప్పేవాడు కాదన్నారు. అయితే ఈ ఆరోపణలపై పవిత్రనాథ్ ఎప్పుడూ, ఎక్కడా స్పందించలేదు. కొన్నాళ్లకు సీరియల్స్ కు కూడా దూరమయ్యాడు.

Read More : ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు స్టార్స్.. కారణం తెలిస్తే ఎగిరి గంతేస్తారు

కట్టుకున్న భార్య తనపై చేసిన ఆరోపణలు, మరోవైపు సీరియల్స్ లేకపోవడంతో అతను మానసికంగా కృంగిపోయినట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యలతో మృతి చెందాడా ? లేక వ్యక్తిగత కారణాలు కారణమయ్యాయా ?అనే దానిపై క్లారిటీ లేదు. పవిత్రనాథ్ మృతిపై అతని కుటుంబ సభ్యులు స్పందించి అధికారిక ప్రకటన చేస్తే తప్ప.. అతని మరణానికి కారణమేంటన్నది తెలిసే ఆస్కారం లేదు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×