Intinti Ramayanam Today Episode December 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ఏదో బిజినెస్ డీల్ గురించి మాట్లాడుతాడు అవని అతనికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రాజేంద్ర ప్రసాద్ ని ఒప్పించి గుడికి తీసుకెళ్లమని చెబుతాడు. పల్లవిని కూడా గుడికి రమ్మని పార్వతి అంటుంది. ఇక ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. అవని మాత్రం బాధపడుతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ పార్వతి తో మాట్లాడుతాడు. ఆ దేవుని ఏం కోరుకున్నావు పార్వతి అని అడుగుతాడు. అప్పుడే పల్లవి ఆరాధ్యను తీసుకుని వస్తుంది.. మావయ్య అత్త ఏం తప్పు చేసిందని అడుగుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత రివర్స్ ప్లాన్ ఇస్తుంది. అత్తయ్య అక్షయ బావ పుట్టినరోజు చేయడం లేదు నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని పెద్ద డ్రామా ని మొదలు పెడతారు. నిజమే అనుకొని అవని నమ్ముతుంది ఇక పార్వతిని అడగడానికి పార్వతి దగ్గరికి వెళ్తుంది. పార్వతి మాత్రం వాళ్ళు చెప్పినట్లు కాకుండా తన కొడుకు బర్త్డే ని చాలా గ్రాండ్గా చేయాలని కేక్ గురించి మాట్లాడుతుంది. ఉదయం లేవగానే అవని అక్షయ్ కి నలుగు పెట్టి స్నానం చేస్తుంది. అది చూసిన పార్వతీ నా కొడుకుకి నేను చేయించాలనుకుంటే అవని చేస్తుందా నా కొడుకు నాకు దూరం చేస్తుంది అనేసి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే భానుమతి పల్లవి వచ్చి పార్వతి మనసులో ఇంకాస్త అనుమానం పెంచుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భానుమతి ప్రతి ఏడాది అక్షయకు నువ్వే తలకు నూనె పెట్టి స్నానం చేయించి బర్త్డేని గ్రాండ్గా చేస్తావు ఈసారి అవకాశం కూడా నీకు నీ కోడలు ఇవ్వలేదు. ఎప్పుడు నేను అవని నేను ఏదైనా అంటే నన్ను అపార్థం చేసుకుంటున్నామని తిట్టేది ఇప్పుడేంటి అర్థమైందా అనేసి అడుగుతుంది. దానికి పల్లవి మాత్రం స్నానం ఒక్కటి అక్క చేయిస్తుంది. మిగిలిన సెలబ్రేషన్స్ అంతా అత్తయ్య చేస్తుంది కదా అందులో తప్పేంటి అని అంటుంది. అప్పుడు భానుమతి ఏమో ఎవరికి తెలుసు అనేసి అనగానే పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది.. ఇక పల్లవి భానుమతి మాట్లాడుకోవడం చూసి కమల్ అక్కడికొస్తాడు ఏంటే మా వదిన గురించి ఏదో అంటున్నావు నీకు ఆహారంలో బొద్దింకల మందు లేకపోతే ఏదో ఒకటి పెడతాను చూసుకో అనేసి అంటాడు. దానికి భానుమతి షాక్ అవుతుంది. వీడుతో పెట్టుకుంటే ఏదైనా వేసైనా చంపేస్తాడనేసి భానుమతి ఆలోచిస్తుంది. ఇక పల్లవి చేతులు నూనె ఏంటి అనగానే అత్తయ్య నాకు ఇచ్చి వెళ్ళింది అనేసి అంటుంది. ఓ నాక్కూడా తలంటి స్నానం చేయాలనుకుంటున్నావా? సరే రారా అని చెప్పేసి అక్కడికి వెళ్తాడు అక్కడ అందరితో చెప్తాడు పల్లవి కమల్ కి నలుగు పెట్టి స్నానం చేస్తుంది..
ఇక అందరూ ఇంట్లోకి వెళ్ళగానే పార్వతి మాత్రం ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవని పార్వతి ఉన్న విషయాన్ని గమనించకుండా ఒక డ్రెస్ ని బయటపడేస్తుంది అవని ఎందుకు అడ్రస్ ని బయటపడేసావంటే అది చిరిగిపోయింది అత్తయ్య పుట్టినరోజు నాడు అది వేసుకోవడం ఎందుకని పడేసానని చెప్తుంది ఇక అది చూసిన భానుమతి పల్లవి డ్రస్సును తీసుకొచ్చి డ్రస్సు ఒక్క చినుకు కూడా లేదు బాగానే ఉంది కదా ఎందుకు పడేసింది నువ్వు ఇవ్వడం ఇష్టం లేదేమో అనేసి అనుమానం పెంచుతారు. ఇక పార్వతి అక్షయ్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. రాజేంద్రప్రసాద్ కమల్ కలిసి కారును గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాడు అది పాతిక లక్షలు విలువ చేస్తుంది అయితే అది అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని ప్రసాద్ అంటాడు ఇక అప్పుడే అక్షయ్ పైనుంచి కిందికి వస్తాడు. డ్రెస్ కాకుండా అవన్నీ ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు అంటే పుట్టినరోజు నాడు అక్షయ్ బాధపడతాడు. ఈ విషయం గురించి చెప్పకపోవడమే మంచిదని పార్వతి ఆలోచిస్తుంది.. ఇక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు అక్షయ్. అవని వెళ్లి అక్షయ కోసం స్వీట్ తీసుకురా పో అనగానే నేను స్వీట్ చేయడం మర్చిపోయాను అనేసి అంటుంది కానీ పార్వతి మాత్రం స్వీట్ నేను చేసి పెట్టాను అనేసి తీసుకొస్తుంది అందరూ స్వీట్ పెట్టి అక్షయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు. బామ్మర్ది రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి తాగడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు లేదంటే ఇంటికొచ్చేస్తానని అంటాడు కానీ రాజేంద్రప్రసాద్ నీ బెదిరింపులకు భయపడేవాన్ని కాదు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను అనేసి అంటాడు.
నీకు ఫోన్ చేస్తే ఎందుకు అలా అంటావ్ డైరెక్ట్ గా ఇంటికి వస్తేనే ఆ విషయం ఏంటో తేలిపోతుందని బెదిరిస్తాడు నీ ఇష్టం వచ్చిన చేసుకొని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక వ్యక్తి పార్వతీకి ఫోన్ చేస్తాడు. అక్షయ్ కి నేను మేనమామ ని అక్షయ్ నీ కొడుకు కాదన్న విషయం నాకు తెలుసు నేను అందరికీ చెప్పను అందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలన్నట్టు డిమాండ్ చేస్తాడు. కానీ పార్వతి ఏం మాట్లాడుకుండా మౌనంగా ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఎపిసోడ్లో అక్షయ్ బర్త్డే వేడుకలను గ్రాండ్గా చేస్తారు రాజేంద్రప్రసాద్ బామ్మర్ది ఆ పార్టీకి వస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..