హౌస్ అరెస్ట్
⦿ కడప ఎంపీ అవినాష్ రెడ్డి గృహ నిర్భంధం
⦿ పులివెందులలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం
⦿ ఘటన ప్రదేశానికి రాకుండానే అడ్డుకున్నపోలీసులు
⦿ ముందు జాగ్రత్త చర్యగానే అరెస్టు అంటున్న సీఐ
⦿ చట్టం ప్రకారమే అరెస్టు చేశాం
⦿ ఎవరి ఒత్తిడీ లేదు
⦿ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి అవినాష్ తరలింపు
⦿ నినాదాలు చేసిన వైసీపీ శ్రేణులు
అమరావతి, స్వేచ్ఛ: MP Avinash Reddy House Arrest: కడప ఎంపీ, వైసీపీ నేత అవినాష్ రెడ్డిని శుక్రవారం ఏపీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ కార్యకర్తలకు, టీడీపీ వర్గానికి పులివెందులలోని వేముల మండలంలో ఘర్షణ జరిగింది. దీనితో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే అవినాష్ రెడ్డి ఘటన ప్రదేశానికి చేరుకోకముందే పోలీసులు ఆయనను సొంత గృహంలోనే నిర్భంధించారు. బయటకు కదలనీయలేదు. ఈ సందర్భంగా సీఐ నరసింహులు మాట్లాడుతూ అవినాష్ రెడ్డి ఘర్షణలు జరిగిన ప్రదేశానికొస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందని, ముందు జాగ్రత్త చర్యగా ఆయను హౌస్ అరెస్ట్ చేశామని తెలిపారు.
ఘర్షణ వాతావరణం
అంతకు ముందు పులవెందులలోని వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇరు వర్గాలకు చెందిన నేతల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. సాగునీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘంతో మాట్లాడేందుకు తాను బయలుదేరుతున్న సమయంలో అకారణంగా పోలీసులు తని ఇంటికే పరిమితం చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. దీనితో కొద్దిసేప పోలీసులకు, అవినాష్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. పోలీసులకు వైసీపీ నేతలు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. తమ ఎంపీనీ అకారణంగా ఎందుకు గృహ నిర్భంధానికి గురిచేశారని నిలదీశారు.
ముందు జాగ్రత్త చర్యగా
అక్కడే ఉన్న తెలుగుదేశం శ్రేణులు వైసీపీ నేతలతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటి పోతున్నదని గ్రహించి స్థానిక పోలీసులు అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత అవినాష్ రెడ్డిని పోలీసులు అక్కడినుంచి జగన్ క్యాంపు కార్యాలయానికి అవినాష్ రెడ్డిని తరలించారు. క్యాంపు కార్యాలయం ముందు వైసీపీ నేతలు కొద్ది సేపు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అవినాష్ ను విడుదల చేయాలని నినాదాలు చేశారు.
చట్టం ప్రకారమే చర్యలు
ఇది కేవలం కూటమి నేతల కక్ష సాధింపు చర్యలలో భాగమే అన్నారు. అసలు అక్కడ గొడవలేమ జరగకుండానే, అకారణంగా అవినాష్ రెడ్డిని అరెస్టు చేశారని వైసీపీ కార్యకర్తలు ఆరోపించారు. కాగా తాము చట్టం ప్రకారమే నడుచుకున్నామని, తమపై ఎలాంటి ఒత్తిడి లేదని సీఐ నరసింహులు వివరణ ఇచ్చారు.