BigTV English

PBKS VS LSG: ఇవాళ పంజాబ్, లక్నో మ్యాచ్… పంత్ భారీ ప్లాన్

PBKS VS LSG: ఇవాళ పంజాబ్, లక్నో మ్యాచ్… పంత్ భారీ ప్లాన్

PBKS VS LSG:   ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament) భాగంగా… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్ లు జరగగా… ఇవాళ 13 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ ( Punjab Kings vs Lucknow Super Giants ) మధ్య మ్యాచ్ ఉండనుంది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్పాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow )… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్… ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయింది.


Also Read: John Cena: కాన్సర్ బారిన పడ్డ WWE సూపర్ స్టార్ జాన్ సీనా !

పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మధ్య గత రికార్డులు


పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య గత రికార్డులు పరిశీలించినట్లయితే… రిషబ్ పంత్ టీం అద్భుతంగా రాణించిందని చెప్పవచ్చు. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు మాత్రమే జరిగాయి. ఈ నాలుగు మ్యాచ్లలో లక్నో సూపర్ జెంట్స్ మూడు మ్యాచ్ల్లో విజయం సాధించింది. అలాగే పంజాబ్ కింగ్స్ ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించింది. అయితే ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పంజాబ్ కింగ్స్ అలాగే లక్నో సూపర్ జెంట్స్ జట్లకు ఇద్దరు కొత్త కెప్టెన్లతో పాటు కొత్త ప్లేయర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఇవాల్టి మ్యాచ్ పైన అంచనా వేయలేమని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.

రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పై ప్రత్యేక దృష్టి

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్, లక్నో కెప్టెన్ పంత్ ఆట తీరుపై ఇవాళ అందరి దృష్టి పడింది ఈ ఇద్దరు ప్లేయర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోనే అత్యధిక ధర పలికారు. ఇవాళ ఈ ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. ఈ తరుణంలో ఎవరు రాణిస్తారు? ఎవరు అట్టర్ ఫ్లాప్ అయితారు ? అనే దాని పైన ఉత్కంఠత నెలకొంది.

Also Read: IPL 2025: KKR కోట కూల్చిన ముంబై కుర్రాడు.. ఎవరీ అశ్వని కుమార్!

పంజాబ్ కింగ్స్  VS లక్నో సూపర్ జెయింట్స్ జట్ల వివరాలు 

లక్నో సూపర్ జెయింట్స్ ప్రాబబుల్ XII: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠీ, ప్రిన్స్ యాదవ్

పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ XII: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (c ), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, లాకీ ఫెర్గూసన్/అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×