BigTV English

Mohan Babu: చిరంజీవిపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు.. ఆ వీడియోను షేర్ చేస్తూ..

Mohan Babu: చిరంజీవిపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు.. ఆ వీడియోను షేర్ చేస్తూ..

Mohan Babu: కలక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మంచు కుటుంబంలో జరుగుతున్న ఆస్తి వివాదాల వలన మోహన్ బాబు రోడ్డున పడ్డాడు. ఇద్దరు కొడుకులు.. ఒకరి మీద ఒకరు హత్యాప్రయత్నాలు  చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. అంతేనా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంకోపక్క  మోహన్ బాబు..  కోపంలో జర్నలిస్ట్ పై దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం అతని పరిస్థితి  ఆందోళనకరంగానే ఉందని సమాచారం.


ఇక ఈ కేసు ఉన్నాకొద్దీ  గజిబిజిగా తయారయ్యింది. పోలీసులు.. మోహన్ బాబును అరెస్ట్ చేయడానికి చూస్తుంటే .. ఆ భయంతో ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తానెక్కడికి పారిపోలేదని, పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని మోహన్ బాబు చెప్పాడని, ప్రస్తుతం ఆయన తిరుపతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో  మోహన్ బాబు సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్నాడు.

Rewind 2024 : ఈ ఏడాది తల్లిదండ్రులైన సెలబ్రిటీ కపుల్స్ వీళ్ళే


ముఖ్యంగా ఆయన నటించిన, నిర్మించిన సినిమాలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ను  షేర్ చేస్తూ.. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నాడు. తాజాగా మోహన్ బాబు , చిరంజీవి కలిసి నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు   సినిమాకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. ” నా ప్రయాణంలో పట్నం వచ్చిన పతివ్రతలు (1982)కి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతిభావంతులైన శ్రీ మౌలీ  దర్శకత్వం వహించారు.  నేను నిజంగా ఈ పాత్రను పోషించడం చాలా ఆనందంగా భావిస్తున్నాను. ముఖ్యంగా అన్నదమ్ములుగా నా ప్రియమైన స్నేహితుడు శ్రీ చిరంజీవితో స్క్రీన్‌ను పంచుకోవడం ఎంతో అద్భుతం. ఈ సినిమా నాకు మరిచిపోలేని చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇకపోతే ఇప్పుడంటే చిరు- మోహన్ బాబు మధ్య కొంత గ్యాప్ వచ్చింది కానీ.  గతంలో వీరిద్దరి మధ్య  పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉండేవట. కానీ, వాటిని ఎప్పుడు వీరు బయటపెట్టేవారు కాదు. ఇద్దరు ఎంత గొడవపడిన కలిసినప్పుడు మాత్రం ప్రాణ స్నేహితులుగా మాట్లాడుకునేవారు.

Samantha: సామ్ ఏడుపు వెనుక ఇదా అసలు కథ.. ఖంగుతిన్న ఫ్యాన్స్..!

చిరంజీవితో విభేదాల గురించి మోహన్ బాబును అడిగినప్పుడు తమ ఇద్దరి మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య జరిగినట్లు జరుగుతాయని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు చిరంజీవి గురించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ పాజిటివ్ గా  స్పందిస్తున్నారు. సూపర్ మూవీ అంటూ చెప్పుకొస్తున్నారు. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×