Thriller Movies 2024: థియేటర్లలో వచ్చే సినిమాల కన్నా ఓటీటీలో ఎప్పుడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతాయో మిస్ అవ్వకుండా చూడాలని మూవీ లవర్స్ వెయిట్ చేస్తుంటారు అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేవు. ఇక్కడ నిత్యం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి వారానికి 20 పైగా సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక హారర్ థ్రిల్లర్ మూవీలకు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నారు. హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువే.. ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న టాప్ వ్యూస్ ను అందుకున్న టాప్ 5 మూవీస్ ఏవో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..
మహారాజా..
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన మూవీ మహారాజా.. ఈ మూవీ ఈ ఏడాది జూన్ 14 న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. యాక్షన్, థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకోవడంతో పాటుగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. డిఫరెంట్ స్టోరీ కావడంతో అన్ని ఏరియాల్లో మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. జూలై 12వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కొన్ని వారాల పాటు టాప్‍లో కొనసాగింది. గ్లోబల్‍గానూ ట్రెండ్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మహారాజా మూవీకి భారీ వ్యూస్ దక్కాయి. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. నాలుగు నెలల పాటు ట్రెండింగ్ లో ఉండటం మాత్రమే కాదు మంచి వ్యూస్ ను కూడా అందుకుంది..
సెక్టార్ 36..
బాలీవుడ్ యంగ్ నటుడు విక్రాంత్ మాసే ప్రధాన పాత్ర పోషించిన సెక్టార్ 36 మూవీ సెప్టెంబర్ 13వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి నేరుగా వచ్చింది.. ఆదిత్య నంబల్‍కర్ దర్శకత్వం వహించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ మూవీ భారీ వ్యూస్ ను అందుకుంది..
కిల్..
ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్ ఈ ఏడాది థియేటర్లలో సాలిడ్ హిట్ కొట్టింది. ఈ మూవీలో లక్ష్య, రాఘవ్ జుయల్, తాన్య లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ సెప్టెంబర్ 6న డిస్నీ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.. వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. దాంతో ఓటీటీలో ఈ ఏడాది సక్సెస్ టాక్ ను సొంతం చేసుకొని అరుదైన రికార్డు ను సొంతం చేసుకుంది.
గామి..
తెలుగు మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్ నటించిన థ్రిల్లర్ మూవీ గామి.. ఈ మూవీలో చాందిని హీరోయిన్ గా నటించింది. థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సూపర్ సక్సెస్ అయింది.. మార్చి 8న థియేటర్లలో రిలీజై బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఏప్రిల్ 12 వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సినిమాకు మొదటి నుంచి మంచి వ్యూస్ దక్కాయి.. ఇప్పటికి వ్యూస్ ను రాబడుతుందని తెలుస్తుంది.
బెర్లిన్..
అపర్‌శక్తి ఖురానా, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ మూవీ బెర్లిన్.. ప్రముఖ ఓటీటీ యాప్ జీ5 ఓటీటీలో దుమ్మురేపింది. ఈ చిత్రంలో సెప్టెంబర్ 13న నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. బధిరుడైన గూఢచారిని విచారించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. బెర్లిన్ మూవీకి అతుల్ సబర్వాల్ దర్శకత్వం వహించారు..
వీటితో పాటుగా చాలా సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.