BigTV English

Drishyam 3: గతం ఎప్పటికీ మారదు.. ‘దశ్యం 3’పై మోహన్‌లాల్ అదిరిపోయే అప్డేట్..

Drishyam 3: గతం ఎప్పటికీ మారదు.. ‘దశ్యం 3’పై మోహన్‌లాల్ అదిరిపోయే అప్డేట్..

Drishyam 3: మలయాళ మేకర్స్ అంటే ఫీల్ గుడ్ సినిమాలు మాత్రమే తెరకెక్కించగలరు. థ్రిల్లర్స్ లాంటివి వారు ఇప్పటివరకు పెద్దగా తెరకెక్కించలేదు అనుకుంటున్న ప్రేక్షకులకు ‘దృశ్యం’ సినిమాను అందించాడు దర్శకుడు జీతూ జోసెఫ్. ఆ సినిమా కథ, స్క్రీన్ ప్లే చూసి ఆడియన్స్ అంతా ఒక్కసారి షాకయ్యారు. ఇంత మంచి థ్రిల్లర్ ఎలా తెరకెక్కించగలిగాడు అంటూ ఆశ్చర్యపోయారు. అలాంటి సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే అవకాశం ఉంటుందని కూడా ఎవరూ ఊహించలేదు. అలాంటిది దానికి పర్ఫెక్ట్ సీక్వెల్‌తో వచ్చి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే ఫ్రాంచైజ్‌లో మరో మూవీ ఉంటుందా లేదా అనే విషయంపై హీరో మోహన్‌లాల్ అదిరిపోయే అప్డేట్ అందించారు.


సీక్వెల్ సూపర్ హిట్

జీతూ జోసెఫ్, మోహన్‌లాల్ (Mohanlal) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమా గురించి కేవలం మాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు.. ఏ థ్రిల్లర్ మూవీ లవర్స్ కూడా మర్చిపోలేరు. ఆ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. పైగా ఆ సినిమా అంత సక్సెస్ అవ్వడానికి మోహన్‌లాల్ లాంటి సీనియర్ హీరో ఒక ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో కనిపించడం కూడా కారణమే. అదే పాత్రను తెలుగులో వెంకటేశ్ చేసి అందరినీ అలరించారు. తమిళంలో ఈ పాత్రకు కమల్ హాసన్ ప్రాణం పోశారు. అలా సినిమా అన్ని భాషల్లో సమానంగా సక్సెస్ అయ్యింది. మామూలుగా థ్రిల్లర్ సినిమాలకు సీక్వెల్స్ అంతగా వర్కవుట్ అవ్వవు. కానీ ‘దృశ్యం’ విషయంలో అలా జరగలేదు. సీక్వెల్ కూడా సూపర్ హిట్ అయ్యింది.


పోస్ట్‌తో క్లారిటీ

అసలు ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్ వస్తుందని కూడా ఎవరూ ఊహించలేదు. అలాంటిది ఆ ముగిసిపోయిన కథను కంటిన్యూ చేస్తూ దానిని మరొక థ్రిల్లింగ్ సీక్వెల్‌గా చేశాడు దర్శకుడు జీతూ జోసెఫ్. దీంతో ఈ దర్శకుడు మూవీకి మూడో పార్ట్ కూడా తెరకెక్కిస్తాడని చాలామంది ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు. అనుకున్నట్టుగానే ‘దృశ్యం 3’కు కథను రాయడం మొదలుపెట్టాడు డైరెక్టర్. ఇదే విషయాన్ని పలుమార్లు మోహన్‌లాల్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ ఫ్రాంచైజ్ ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఇక తాజాగా ‘దృశ్యం 3’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఒక పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మోహన్‌లాల్.

Also Read: డెడ్లీయెస్ట్ షో డౌన్ బిగిన్స్.. తారక్ లేకుండానే పట్టాలెక్కిన ‘డ్రాగన్’

కథ ఎలా సాగుతుంది.?

దర్శకుడు జీతూ జోసెఫ్ (Jeethu Joseph), నిర్మాత ఆంటోనీ పెరుంబావూర్‌తో కలిసి దిగిన ఫోటోను మోహన్‌లాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘గతం అనేది ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. దృశ్యం 3 (Drishyam 3) కన్ఫర్మ్ అయ్యింది’ అంటూ ఈ పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టారు. దీంతో ఇప్పటికే కథ మొత్తం ముగిసిపోయింది అనుకున్న ‘దృశ్యం’ సినిమాకు మూడో భాగం ఎలా వస్తుంది, అసలు దీనిని ఎలా తెరకెక్కిస్తారు అని ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి మొదలయ్యింది. ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రెండు పార్ట్స్‌ను తెలుగు రీమేక్ చేసిన వెంకీ మామ.. తెలుగు ప్రేక్షకుల కోసం మూడో భాగాన్ని కూడా రీమేక్ చేస్తారా అనే చర్చలు కూడా అప్పుడే మొదలయ్యాయి.

 

View this post on Instagram

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×