Oil For White Hair: ఈ రోజుల్లో జుట్టు తెల్లబడటం అనేది చాలా కామన్. చాలా మంది వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యలను ఎదుర్కుంటున్నారు. దీనికి గల ప్రధాన కారణం మారుతున్న జీవన శైలితో పాటు ఆహారపు అలవాట్లు. ఇవి మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి.
ఇదిలా ఉంటే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు మార్కెట్‌లో దొరికే, రసాయనాలతో తయారు చేసిన హెయిర్ ఆయిల్స్‌తో పాటు రకరకాల షాంపూలను కూడా వాడుతుంటారు. ఇంకొందరు హెయిర్ కలర్స్ కూడా ట్రై చేస్తారు. మరి ఇంత చేసినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అంతే కాకుండా రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొన్ని హోం రెమెడీస్ వాడటం మంచిది. మరి తెల్ల జట్టు తక్కువ సమయంలోనే నల్లగా మారాలంటే ఎలాంటి హోం రెమెడీస్ ఉపయోగపడతాయి. వాటిని ఎలా వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. కావాల్సినవి:
ఉసిరి పొడి- 1 టేబుల్ స్పూన్
మెంతి పొడి- 1 టేబుల్ స్పూన్
ఆలివ్ ఆయిల్- 1 చిన్న కప్పు
తయారీ విధానం:
తెల్ల జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవాలంటే.. ఉసిరిపొడి, మెంతి గింజలను ఉపయోగించవచ్చు. ఇందుకోసం మీరు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ మెంతి పొడితో పాటు ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని వేసి మిక్స్ చేయండి. తర్వాత అందులో చిన్న కప్పు ఆలివ్ ఆయిల్ వేసి కలపండి. ఇలా తయారు చేసిన ఈ ఆయిల్ ను జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే వదిలేయండి. తర్వాత రోజు ఉదయం షాంపూతో తలస్నానం చేయండి. ఇలా నెల రోజుల పాటు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది.
2. కావాల్సినవి:
బాదం నూనె- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలనుకుంటే బాదం నూనె , నిమ్మరసం కలిపి తలకు అప్లై చేయండి. కనీసం అరగంట పాటు ఇలాగే వదిలేయండి. నిజానికి విటమిన్ E బాదం నూనెలో లభిస్తుంది. ఇది తెల్ల జుట్టును సులభంగా నల్లగా మారుస్తుంది.
3. కావాల్సినవి:
కరివేపాకు- ఒక చిన్న కప్పు
ఆవాల నూనె- సరిపడా
తయారీ విధానం:
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవాలని అనుకుంటే మాత్రం మీరు ఒక కప్పు ఆవాల నూనెలో ఒక చిన్న కప్పు కరివేపాకు వేసి బాగా మరిగించాలి. అది చల్లబడిన తర్వాత, దానిని ఒక సీసాలోకి ఫిల్టర్ చేసి, ప్రతి వారం మీ జుట్టుకు మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. కరివేపాకులో విటమిన్ బి ఉంటుంది. ఇది జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తుంది. అంతే కాకుండా ఇప్పటికే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దీనిని వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ఆముదంలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. జన్మలో బట్ట తల రాదు
4. ఉల్లిపాయ రసం:
నేటి కాలంలో తెల్ల జుట్టును నల్లగా మార్చడం కొంచెం కష్టమైన పని. కానీ అది అసాధ్యం కాదు. మీరు కూడా మీ తెల్ల జుట్టును నల్లగా చేసుకోవాలనుకుంటే ఒక తగినంత ఉల్లిపాయ రసంలో నిమ్మరసం కలిపి దానికి ఆలివ్ నూనె కూడా కలపండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ప్రతి వారం తలస్నానం చేయడానికి ముందు దీన్ని మీ తలకు , జుట్టుకు బాగా మసాజ్ చేయండి. గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా తరచుగా చేయడం వల్ల మీ తెల్ల జుట్టు మళ్ళీ సహజంగా నల్లగా మారడం ప్రారంభమవుతుంది