NTR-Neel Movie : మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఎన్టీఆర్ 31’ (NTR 31) ఎట్టకేలకు పట్టాలెక్కింది. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చిత్ర బృందం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) షూటింగ్ చేస్తూ సెట్లో నిల్చున్న పిక్ ను పోస్ట్ చేస్తూ మూవీ మొదలైంది అన్న విషయాన్ని వెల్లడించారు.
ఎన్టీఆర్ లేకుండానే మొదలైన ‘డ్రాగన్’
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ దిల్ కాంబినేషన్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ తెరకెక్కబోతోంది అనే విషయాన్ని చాలా రోజుల క్రితం ప్రకటించారు. ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాగా, తాజాగా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టింది టీం. ఈరోజు హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో అధికారికంగా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఈ మేరకు అక్కడ భారీ సెట్ లను నిర్మించగా, రామోజీ ఫిలిం సిటీ లోనే దాదాపు 10 రోజుల పాటు మొదటి షెడ్యూల్ ను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఇక ఈ షూటింగ్లో 1500 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నట్టు సమాచారం. అయితే మొదటి షెడ్యూల్ లో ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలు మాత్రం లేవని టాక్ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా “ది డెడ్లియేస్ట్ షో డౌన్ బిగిన్స్… వెల్కమ్ టు ద టెరిటరీ ఆఫ్ డిస్ట్రక్షన్” అంటూ ప్రశాంత్ నీల్ ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేస్తున్న పిక్ ను పోస్ట్ చేశారు. ఆ పోస్టును జూనియర్ ఎన్టీఆర్ రీపోస్ట్ చేస్తూ “అండ్ ఇట్ బిగిన్స్” అంటూ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. బంగ్లాదేశ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఎన్టీఆర్ సెట్లోకి అడుగు పెట్టేది అప్పుడే?
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ‘వార్ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీతోనే తారక్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే జనవరి చివరికల్లా ఈ మూవీ షూటింగ్ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ పలు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కాగా, మార్చ్ నుంచి ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సెట్ లో జాయిన్ కాబోతున్నారని తెలుస్తోంది.
మరోవైపు ‘వార్ 2’ షూటింగ్ రోజురోజుకూ మరింత ఆలస్యం అవుతోంది. ఈ సినిమాలో ఇంకా చాలా వరకు షూటింగ్ పెండింగ్ లో ఉందని తెలుస్తోంది. చాలా వరకు షూటింగ్ ను విదేశాల్లో ప్లాన్ చేశారు. హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ లతో రూపొందించాల్సిన ఒక స్పెషల్ సాంగ్ కూడా పెండింగ్‌లో ఉంది. కానీ మూవీ రిలీజ్ కు మాత్రం కేవలం ఐదు నెలలు మాత్రమే మిగిలి ఉండటంతో ఇద్దరు హీరోల అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
And it begins… #NTRNeel https://t.co/Te4RFvnT68
— Jr NTR (@tarak9999) February 20, 2025