Roja – Meena:ఈమధ్య కాలంలో అటు మ్యూజిక్ డైరెక్టర్లు, ఇటు డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లతో పాటూ డాన్స్ కాన్సర్ట్ లు కూడా ఏర్పాటు చేసి తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ఆయన ప్రభుదేవా(Prabhudeva ) కూడా ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సీనియర్ స్టార్ హీరోయిన్స్ హాజరై ప్రభుదేవాతో కలిసి చిందులేసారు. ముఖ్యంగా ఈ వయసులో కూడా డాన్స్ విషయంలో దుమ్ము దులుపుతూ రెచ్చిపోవడంతో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుదేవాతో కలిసి అటు రోజా, ఇటు మీనా ఇద్దరు కూడా పోటీ పడుతూ మరీ డాన్స్ చేయడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
బుల్లితెరపై రీయంట్రీ ఇచ్చిన రోజా..
ఆర్కే రోజా (RK Roja) .. సీనియర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గతంలో పలు సినిమాలలో నటిస్తూనే, మరొకవైపు జబర్దస్త్ (Jabardast) వంటి కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించి, దాదాపు 9 సంవత్సరాల పాటు అక్కడే ఫిక్స్డ్ జడ్జ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. మరొకవైపు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొన్న ఈమె.. గత ప్రభుత్వంలో మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ కి గుడ్ బాయ్ చెప్పేసి రాజకీయాలలోకి వెళ్లిపోయింది. ఇక అదే సమయంలో సినిమాలు, టీవీ షోలు మానేస్తున్నానని చెప్పిన ఈమె, అనూహ్యంగా గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో నగరి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది.. ఇక దాంతో మళ్లీ ఇప్పుడు నాలుగు సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఖాళీగా వృధా చేయకుండా మళ్లీ బుల్లితెరపై రీఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జీ తెలుగులో ప్రసారమైన ఒక షో ద్వారా టీవీ రంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది రోజా. ఇటీవల ఆ షో కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.
ప్రభుదేవా తో పోటీపడి మరీ డాన్స్ చేసిన రోజా, మీనా..
ఇప్పుడు ప్రభుదేవా నిర్వహించిన ఈవెంట్ కి హాజరైంది. ప్రభుదేవా చెన్నైలో లైవ్ డాన్స్ కాన్సర్ట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ తో పాటు హీరోలు కూడా వచ్చి సందడి చేశారు. ముఖ్యంగా మీనా, రంభ, నగ్మా, సంగీత ఇలా అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో కలిసి రోజా సందడి చేసింది. అటు ధనుష్, వడివేలుతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా డాన్స్ చేశారు. ఒక మాస్ సాంగ్ కి స్టెప్పులు వేశారు. ఈ వీడియోలను అధికారికంగా రిలీజ్ చేయకపోయినా.. ఈ ఈవెంట్ కి వెళ్లిన పలువురు ఆడియన్స్ ఆ వీడియోలను తమ యూట్యూబ్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ వీడియోలు కాస్త బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ ఆల్రెడీ షోలోకి రోజా ఎంట్రీ ఇచ్చింది. ఈవెంట్లో డాన్స్ తో అదరగొట్టేస్తోంది. సినిమాల్లో కూడా రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మీనా(Meena ) కూడా తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ అబ్బురపరిచింది. మరి ఇద్దరు స్టార్ హీరోయిన్స్ కి టాలీవుడ్ లో ఎలాంటి అవకాశాలు లభిస్తాయో చూడాలి.