HBD Mokshagna Teja: నందమూరి కుటుంబం నుండి మరో వారసుడు హీరోగా అలరించడానికి సిద్ధమయ్యాడు. తనే నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ. బాలయ్య వారసుడిని హీరోగా చూడాలని ఫ్యాన్స్ అంతా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక కొన్నాళ్ల క్రితం తాను హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్నానంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసి ప్రకటించాడు మోక్షజ్ఞ. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా తన మొదటి సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన బయటికొచ్చింది. టాలీవుడ్‌లో వినిపించిన రూమర్స్‌ను నిజం చేస్తూ మోక్షజ్ఞ తేజ డెబ్యూ సినిమాను ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేస్తున్నాడు.
హ్యాపీ బర్త్ డే మోక్షు
దర్శకుడు ప్రశాంత్ వర్మ.. మోక్షజ్ఞ తేజ ఫస్ట్ లుక్‌ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో మోక్షజ్ఞ కూల్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్‌ను విడుదల చేస్తూ తన సంతోషాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకున్నాడు ప్రశాంత్ వర్మ. ‘ఎంతో ఆనందం, గర్వంతో నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజను మీకు పరిచయం చేస్తున్నాను. హ్యాపీ బర్త్ డే మోక్షు’ అని పోస్ట్‌ను షేర్ చేశాడు ప్రశాంత్. అంతే కాకుండా తనను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)లోకి ఆహ్వానించాడు. తనపై నమ్మకం ఉంచి, మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతలను తనకు అప్పగించినందుకు బాలకృష్ణకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాను అందరికీ స్పెషల్‌గా గుర్తుండిపోయేలా చేస్తానని అభిమానులకు మాటిచ్చాడు.
Also Read: సల్మాన్‌కు మాఫియా డాన్ దావూద్ మద్దతు? వాళ్లను జైల్లోనే లేపేయడానికి ప్లాన్.. మూవీస్‌ను మించి స్కెచ్!
సినిమాటిక్ యూనివర్స్
తేజ సజ్జాతో తెరకెక్కించిన ‘హనుమాన్’తో దర్శకుడిగా ప్రశాంత్ వర్మ రేంజే మారిపోయింది. అంతే కాకుండా ‘హనుమాన్’ అనేది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమని ప్రకటించి ఈ యూనివర్స్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెంచేశాడు. ఆ మూవీ విడుదలయిన వెంటనే దానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ వస్తుందని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. కానీ ఏమైందో తెలియదు.. కొన్నాళ్ల పాటు ‘జై హనుమాన్’ను పక్కన పెట్టాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి రెండో సినిమాగా ‘సింబా’ వస్తుందని ప్రకటన విడుదల చేశాడు. ఇక ‘సింబా’లో హీరోగా మోక్షజ్ఞ తేజను పరిచయం చేస్తూ విడుదల చేసిన అప్డేట్.. ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తోంది.
బాలయ్యతో సాన్నిహిత్యం
యంగ్ హీరో ప్రశాంత్ వర్మకు, బాలకృష్ణకు మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో కొన్నాళ్ల పాటు దర్శకుడిగా గ్యాప్ ఇచ్చి పూర్తిగా ‘హనుమాన్’పైనే ఫోకస్ పెట్టాడు ప్రశాంత్. అదే సమయంలో బాలయ్య హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోను హోస్ట్ చేసే అవకాశం ప్రశాంత్ వర్మకు వచ్చింది. అప్పుడే బాలయ్యతో ప్రశాంత్‌కు పరిచయం ఏర్పడింది. ప్రశాంత్ టాలెంట్ చూసి బాలయ్య ఫిదా అయ్యారు. అందుకే బాలకృష్ణ కోసం ‘హనుమాన్’ ప్రీమియర్‌ను స్పెషల్‌గా ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ. ఆ సినిమా చూసిన తర్వాత తన దర్శకత్వంలో నటించాలని ఉందని బాలయ్య మనసులోని మాటను బయటపెట్టారు. ఇప్పుడు ఏకంగా తన వారసుడి డెబ్యూ బాధ్యతలను ఈ యంగ్ డైరెక్టర్‌కు అప్పగించారు.
With great joy & privilege, Introducing you…
“NANDAMURI TARAKA RAMA MOKSHAGNYA TEJA” 🦁
Happy birthday Mokshu 🥳
Welcome to @ThePVCU 🤗
Let’s do it 🤞Thanks to #NandamuriBalakrishna Garu for all the trust & blessings 🙏
Hoping to make this one much more special &… pic.twitter.com/gm9jnhOvYx
— Prasanth Varma (@PrasanthVarma) September 6, 2024