Sitaram Yechury in ICU at AIIMS Delhi : కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సీపీఎం సీనియర్ జాతీయ నేత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. అయితే గత గురువారం రాత్రి నుంచే వెంటిలేటర్ పై చికిత్సనందిస్తూ వస్తున్నారు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. 72 సంవత్సరాల సీతారం ఏచూరి గత నెల ఆగస్టు 19 నుంచే ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించడంతో అక్కడినుండి ఐసీయు కి తరలించామని వైద్యులు తెలిపారు. ఢిల్లీ ఎయిమ్స్ కుచెందిన ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుందని ఆసుపత్రి వైద్య విభాగాలు తెలిపాయి. ఆయన కొంతకాలంగా న్యూమోనియాతో బాపడుతున్నారని..దాని గురించే ట్రీట్ మెంట్ తీసుకొంటున్నారని..అయితే గత రాత్రి హఠాత్తుగా ఊపిరితిత్తులలో నెమ్ము చేరుకోవడంతో ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని అన్నారు.
అంచెలంచెలుగా ఎదిగి..
వెంటిలేటర్ పై నిరంతర చికిత్స అందిస్తున్నామని అన్నారు. అయితే ఆయనను ఆసుపత్రిలో సందర్శించేందుకు పెద్ద ఎత్తున సీపీఎం నేతలు తరలి వస్తున్నారు. వైద్యులు ఎవరినీ అనుమతించడం లేదు. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ లు విడుదల చేస్తామని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల కోసం కార్యదక్షతతో పనిచేసే ఏచూరి పలు సందర్బాలలో బీజేపీ వైఖరిని ఎండగట్టారు. పార్టీ సీనియర్ నేతగా పలువురికి ఆదర్శంగా ఉన్నారు. 2005 లో పశ్చిమ బెంగాల్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఏపీలోని కాకినాడకు చెందిన ఏచూరి సీతారాం పలు ప్రజా ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి నేత నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.