BigTV English

Beer Museum: ప్రపంచంలోనే అతిపెద్ద బీరు మ్యూజియం, ఇక్కడ ఎన్ని రకాల బీర్లు ఉంటాయో తెలుసా?

Beer Museum: ప్రపంచంలోనే అతిపెద్ద బీరు మ్యూజియం, ఇక్కడ ఎన్ని రకాల బీర్లు ఉంటాయో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా మద్యం ప్రియుల సంఖ్య పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నది. సాయంత్రం అయితే, చాలా మందికి సుక్క, ముక్క ఉండాల్సిందే. లేదంటే ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలయ్యే వాళ్లు చాలా మంది ఉన్నారు. మద్యం ఇప్పుడు నిత్యవసర సరుకుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మద్యం నుంచి వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు.


ప్రపంచంలోనే అతిపెద్ద బీరు మ్యూజియం

ఇక మద్యం ప్రియులు తరచుగా వైన్ షాప్ కు వెళ్లి మద్యం కొనుగోలు చేస్తుంటారు. లేదంటే బార్ కు వెళ్లి తాగేసి వస్తారు. అక్కడ అన్ని మొత్తం కలిపినా 50 రకాల మద్యం బ్రాండ్ల కంటే ఎక్కువ ఉండవు. ఓ ఐదారు బ్రాండ్ల బీర్లు కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే బీరు మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్దది. అందులో ఎటు చూసినా రకరాల బీర్లు కనిపిస్తాయి. ఆ మ్యూజియంలోకి అడుగు పెట్టిన మద్యం ప్రియులు స్వర్గంలోకి అడుగు పెట్టినట్లు భావిస్తారు. మద్యం సీసాలు చూసి ఆహా అంటూ ఆశ్చర్యపోతారు.


1000 రకాల బీరు బ్రాండ్లు

ప్రపంచంలోనే అతిపెద్ద బీరు మ్యూజియం చైనాలో ఉంది. జియాంగ్సు ప్రావిన్స్ లోని నాన్జింగ్‌ లో NIUBEER  వరల్డ్ క్రాఫ్ట్ బీర్ మ్యూజియం కొలువుదీరింది. ఇది Jianye Wuyue ప్లాజాలో ఉంది. ఇందులో ఏకంగా 1000 కంటే ఎక్కువ రకాల బీర్లు అందుబాటులో ఉన్నాయి. అద్భుతంగా తయారు చేయించిన గోడల మీద వీటిని కనువిందు చేసేలా అమర్చారు. రంగు రంగుల గోడలపై  నచ్చిన బీర్లను చూసి మద్యం ప్రియులు చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. బంగారు వర్ణంలోని బీరు మ్యూజియాన్ని చూసి అలౌకిక ఆనందాన్ని పొందుతారు.  ప్రపంచంలోని అన్ని రకాల బీర్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కేవలం మ్యూజియమే కాదు, బార్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చి మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకెళ్లవచ్చు. లేదంటే, ఇక్కడే ఉన్న బార్ లో కూర్చొని నచ్చినంత మద్యం తాగవచ్చు.

Read Also: కూలిన బిల్డింగులో ఆఫీస్.. హా హా పప్పులో కాలేశారు!

కొత్త కస్టమర్లు కు 5 శాతం.. రెగ్యులర్ కస్టమర్లకు మరో 2 శాతం..

ఇక ఈ బీరు మ్యూజియంలోకి వచ్చే మద్యం ప్రియులకు ప్రత్యేకమైన డిస్కౌంట్లు కూడా అందిస్తారు. కొత్తగా వచ్చే కస్టమర్లకు మద్యం మీద 5 శాతం డిస్కౌంట్ అందిస్తారు. ఇక రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లకు మరో 2 శాతం అదనంగా తగ్గింపు ఇస్తారు. చైనాకు వెళ్లే చాలా మంది పర్యాటకులు కచ్చితంగా ఈ బీరు మ్యూజియాన్ని సందర్శిస్తారు. నచ్చిన మద్యం రుచి చూసి ఎంజాయ్ చేస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద మ్యూజియం మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యధికంగా మద్యం అమ్ముడయ్యే ప్రదేశంగానూ ఇది గుర్తింపు తెచ్చుకుంది.  సో, మీరు ఎప్పుడైనా చైనాకు వెళ్తే తప్పకుండా ఈ మ్యూజియానికి వెళ్లండి. రకరకాల మద్యం సీసాలను చూసి తరించండి. నచ్చి బీరు కొని టేస్టీ చేయడం మానకండి!

Read Also: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని బైకులకు నిప్పు, మరీ ఇంత ఘోరమా?

Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×