Best romantic movies on OTT : ఓటీటీలో సౌత్ ఇండియన్ రొమాంటిక్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఒంటరిగా ఉనప్పుడైనా, జంటగా కలసి చూడాలనుకున్నా మనసుకు హత్తుకునే విధంగా ఉంటాయి. ఈ రొమాంటిక్ సినిమాలు ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని బెస్ట్ లవ్ స్టోరీల గురించి తెలుసుకుందాం పదండి.
హాయ్ నాన్నా (Hi Nanna)
హాయ్ నాన్నా అనేది ఒక మరపురాని హార్ట్ టచింగ్ మూవీ .ఈ మూవీలో హీరో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. మృణాల్ తన అంద చందాలతో కుర్రకారు మతి పోగొట్టింది. నాని, మృణాల్ మధ్య ప్రేమ కధ మూవీ లవర్స్ ను కంటతడి పెట్టిస్తుంది. ఈ హార్ట్ టచ్చింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమించడం అంటే ఏమిటో ఈ మూవీని చూస్తే తెలుస్తుంది. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
తిరుచిత్రంబలం (Tiruchitrambalam)
ధనుష్, నిత్యా మీనన్, రాశి ఖన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జవహర్ దర్శకత్వం వహించారు. మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ సినిమా కోసం ఎదురుచూస్తుంటే ‘తిరుచిత్రంబలం’ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్. ధనుష్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. బెస్ట్ ఫ్రెండ్‌గా నిత్యా మీనన్ తన ప్రతిభను చాటుకుంది. కామెడీతో పాటు, తండ్రీ కొడుకుల సెంటిమెంట్ మూవీ లవర్స్ ను ఏడిపిస్తుంది. ప్రైమ్ వీడియో ( Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఆణిముత్యాన్ని తప్పకుండా చూడండి.
హృదయం (Hridayam)
మూవీలో ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధానపాత్రలు చేయగా, వినీత్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. కాలేజ్ రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చేలా ఉంటుంది ఈ మూవీ. కాలేజ్ తగాదాలు, లవ్ స్టోరీ ఉండడం వలన ఈ మూవి లవర్స్ ను ఈ మూవీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ మూవీని (Disney+Hotstar) లో వీక్షించవచ్చు.
జో (joe)
బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో ఈ మూవీని తెరకెక్కించాడు దర్శకుడు. సరదాగా సాగిపోయే సన్నివేశాలతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త ఏడిపించినా యూత్ ని ఆకట్టుకునే సీన్స్ చాలానే ఉన్నాయి. రియో రాజ్, మాళవిక మనోజ్ ప్రధాన పాత్రలతో నటించిన ఈ మూవీకి హరిహరన్ దర్శకత్వం వహించాడు. ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ ప్రస్తుతం హాట్స్టార్ (Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇరుగపత్రు (irugapatru)
విక్రమ్ ప్రభు, శ్రద్ధ శ్రీనాథ్, సానియా ప్రధాన పాత్రలతో నటించిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. భార్య, భర్తలు గొడవ పడితే ఎలా ఉంటుందో, గొడవ పడకపోతే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించారు. ఫ్యామిలీ తో కలసి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీని చూడాలనుకుంటే ఈ మూవీని చూడండి.