trinayani serial today Episode: అమ్మవారి ముందు ఉన్న నైవేద్యాన్ని ప్రసాదంగా పెడితే ఆనందంగా తింటాను అంటుంది వైకుంఠం. దీంతో నేత్రి అత్తకు ఆకలిగా ఉన్నట్టుగా ఉంది. పెడతాను ఉండండి అని ప్రసాదం తీసి ముక్కోటికి వైకుంఠానికి పెడుతుంది. నేత్రి. దీంతో ముక్కోటి తిన్నట్టుగా నటించు తినకు అంటూ వైకుంఠానికి చెప్తాడు. సరే అంటుంది. నేత్రి కూడా ప్రసాదం తీసుకోగానే ముక్కోటి బ్రహ్మాండంగా ఉందని చెప్తాడు. అత్త ఇన్ని రోజులకు నీ వంటను మెచ్చుకున్నాడు మామ చూడు అంటుంది నేత్రి. నువ్వు కూడా తిను త్రినేత్రి అంటుంది వైకుంఠం.
దీంతో నేత్రి ప్రసాదం తింటుంది. చాలా బాగుంది అంటుంది. మరోవైపు యమలోకం నుంచి యమపాశం వస్తుంది. ఇంకోవైపు ఇంటి దగ్గర ఉన్న బామ్మ చేతిలో కుంకుమ కింద పడిపోతుంది. అమ్మవారి దగ్గర నేత్రి కళ్లు తిరిగి కింద పడిపోతుంది. ఇంతలో యమపాశం వచ్చి నేత్రి ప్రాణాలు తీయగానే అమ్మవారిలో ఐక్యం అవుతుంది. నేత్రి చనిపోయిందని కన్ఫం చేసుకున్న ముక్కోటి నేత్రి పూల కోసం అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదని ఊర్లో వాళ్లకు చెప్పాలని శవాన్ని అడవిలోకి తీసుకెళ్తుంటారు. ఎవరు వెళ్లని ప్లేస్ లో నేత్రి బాడీని వదిలి వెళ్తారు.
మరోవైపు విక్రాంత్ డాక్టర దగ్గర ఉంటాడు. ఎంతో మంది ప్రాణాలు కాపాడిన మీరు మా విశాల్ బ్రో ప్రాణాలు కాపాడాలి అని వచ్చాను. మా నయని వదిన కోమాలోకి వెళ్లిందని నేను ఇప్పటి వరకు ఎవరితో చెప్పలేదు అంటాడు. అలా చెప్పకుండా ఎన్నిరోజలు ఉంటాము. ఫ్యామిలి డాక్టర్ కాబట్టి నన్ను బలవంతం చేస్తారు. డాక్టర్ దగ్గర నిజం దాచొద్దు అంటారు. మీరేమో డాక్టర్ ను అబద్దం చెప్పమంటున్నారు అంటుంది. నిజం మాత్రమే కాదు డాక్టర్ మా వదినను కూడా దాచి పెట్టండి మా వదిన కోమాలోంచి బయటకు వచ్చే వరకు ఎక్కడైనా దాచండి. వేరే హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ జరుగుతుందని నమ్మించండి. కానీ మా వదిన కోమాలో ఉందని మా బ్రో ప్రాణాలు తీయకండి అంటూ ప్రాధేయపడతాడు.
ముక్కోటి, వైకుంఠం ఇంటికి వస్తారు. బామ్మను చూసి ఏడుపు నాటకం మొదలు పెడతారు. బామ్మ బయటకు వచ్చి ఏమైందని అడుగుతుంది. ఏం జరిగిందో చెప్పండంటుంది. దీంతో ముక్కోటి ఘోరం జరిగిపోయింది అత్తా అంటూ ముక్కోటి ఏడుస్తాడు. దీంతో బామ్మ తిట్టడంతో నువ్వు చెప్పవే.. అంటాడు. వైకుంఠం కూడా నువ్వే చెప్పు అంటుంది. ఇంతలో బామ్మ అమ్మవారి దగ్గరకు ముగ్గురు వెళ్లి ఇద్దరే వచ్చారేంటి అని అడుగుతుంది. ముక్కోటి పోయింది అత్తా అని చెప్పగానే బామ్మ ముక్కోటిని కొడుతుంది. దీంతో వైకుంఠం అమ్మ నేను చెప్తాను అంటూ అమ్మవారికి అడవి పూలు తీసుకురావడానికి అడవిలోకి వెళ్లింది. మేము చాలా దూరం వెళ్లి చూశాము ఎక్కడ కనిపించలేదు. అక్కడక్కడ పులి జాడలు, పచ్చి నెత్తుటి మరకలు కనిపించాయి అని చెప్పగానే బామ్మ ఏడుస్తూ కింద పడిపోతుంది. అమ్మోరును నమ్ముకున్న బిడ్డ చనిపోయిందా..? అది పోయి నేను బతికుంటే లాభం ఏముంది. అంటూ ఏడుస్తుంది. ముక్కోటి, వైకుంఠం కూడా ఏడుస్తున్నట్టు నటిస్తారు.
మరోవైపు గాయత్రి పాపను ఎత్తుకుని అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో హాసిని అక్కడకు వచ్చి పాప పడుకుందా విశాల్ అని అడుగుతుంది. ఇంకా పడుకోలేదని నిద్రకైతే వచ్చిందని విశాల్ చెప్తాడు. గానవి అన్నం తింటుంది. పాలు తాగుతుంది. తన గురించి ఏం బెంగ లేదు అల్లుడు కానీ గాయత్రి పాపే ఏం తినడం లేదు. తాగడం లేదు అంటాడు పావణమూర్తి. దీంతో గాయత్రి అక్క పూర్వ జన్మే కదా.. గాయత్రి పాప అందుకే అని తిలొత్తమ్మ అంటుంది. అయితే ఏంటి మమ్మీ అని వల్లభ ప్రశ్నిస్తాడు.
తన కోడలు చావుబతుకుల మధ్య ఊగిసలాడుతుందని మా అక్క మనసులో ఎంత బాధపడుతుందొ ఏమో పాపం అంటుంది తిలొత్తమ్మ. మా అక్క కోలుకుంటుందో లేదో నని నేనే విచారిస్తున్నాను. గతజన్మలో గాయత్రి అత్తయ్య అయిన ఈ గాయత్రి కుమిలిపోదా చెప్పండి అంటుంది సుమన. విక్రాంత్ వస్తున్నాడు. హాస్పిటల్ నుంచే వస్తున్నావా..? విక్రాంత్ అని హాసిని అడుగుతుంది. అవునని చెప్తాడు విక్రాంత్.
నయనికి ఎలా ఉందని విశాల్ అడుగుతాడు. గంటగంటకి అడిగితే ఎలా అంటాడు వల్లభ. అయినా సరే ఆత్రం ఉంటుంది వల్లభ అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో విక్రాంత్ ఎంత ఖర్చైనా బెటర్ ట్రీట్‌మెంట్ ఇవ్వమని చెప్పాను అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న హాస్పిటల్ కు షిప్ట్ చేయమని చెప్పాను అలాగే చేస్తానన్నారు అని విక్రాంత్ చెప్పగానే అయితే మనం వెళ్దాం పదండి అంటాడు విశాల్. వద్దని విక్రాంత్ చెప్తాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.