Mouneesha Chowdary: సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీలకు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. కొత్తగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేవారు దర్శక నిర్మాతల నుంచి ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వారు చెప్పిన దానికి ఊ కొడితేనే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి లేదంటే వారికి కెరియర్ అక్కడితోనే ఆగిపోతుందని ఇప్పటికే ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడారు. ఇలా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరిట ఎంతోమంది ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు కొంతమంది హీరోయిన్లు మీడియా ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగోతాలను బయటపెట్టారు.
ఇబ్బందులు తప్పవా…
ఇక దర్శక నిర్మాతలు అడిగిన కమిట్మెంట్స్ ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా హీరోయిన్ల నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అయితే తాజాగా ఈ విధమైనటువంటి ఇబ్బందులను తాను కూడా ఎదుర్కొన్నాను అంటూ ప్రముఖ మోడల్, నటి మౌనిషా చౌదరి కూడా ఆరోపణలు చేశారు. ఈమె మోడల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈమె మోడల్ గా నటిగా కంటే కూడా సోషల్ మీడియాలో క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతూ ఉంటారు. 2016వ సంవత్సరంలో మౌనిష చౌదరి ఉతా కిరీటాన్ని కూడా కైవసం చేసుకున్నారు. ఇక ఈమె నిత్యం ఇంస్టాగ్రామ్ ద్వారా ఎన్నో అవగాహ కార్యక్రమాలను చేపడుతున్నారు.
కొలతలు అడిగాడు…
ఇలా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఎన్నో అవగాహన కార్యక్రమాలను చేపడుతున్న ఈమె తాజాగా టాలీవుడ్ దర్శకుడు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా దర్శకుడు నా దగ్గరకు వచ్చి సినిమాలలో నటించమని నన్ను కోరారు. ఇక తన సినిమాలో అవకాశాన్ని కూడా ఇస్తానని ఆయన చెప్పారు. అయితే తనకు మాత్రం అతని సినిమాలలో నటించడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ ఆ డైరెక్టర్ వినకుండా ఏకంగా నా తొడల కొలతలను అడిగి ఇబ్బందులకు గురి చేశారు అంటూ మౌనిష చౌదరి వెల్లడించారు. ఇప్పుడు మాత్రం ఆ డైరెక్టర్ ఏకంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారని తెలిపారు.
ఈ విధంగా టాలీవుడ్ డైరెక్టర్ గురించి మౌనిష చౌదరి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. అయితే ఆదర్శకుడు ఎవరు? ఏంటి? అనే విషయాలను ఈమె ఎక్కడ తెలియజేయలేదు కానీ ఆయన ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని మాత్రమే తెలియజేశారు. ఇలా మౌనీష వ్యాఖ్యలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సెలబ్రిటీలకు దర్శక నిర్మాతల నుంచి కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం అవుతుంది. ఇలా మౌనీష చౌదరి టాలీవుడ్ డైరెక్టర్ బాగోతం బయట పెట్టడంతో ఆయన ఎవరై ఉంటారనే చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు తాము క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నాము అంటూ వారి బాధలను బయటకు చెబుతున్న వారిని ఇబ్బందులకు గురిచేసిన వారి పేర్లను మాత్రం తెలియచేయకపోవడం గమనార్హం.