BigTV English
Advertisement

Nani : క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త సినిమా.. ఎన్నాళ్ళకు జోడి కుదిరింది..

Nani : క్రేజీ డైరెక్టర్ తో నాని కొత్త సినిమా.. ఎన్నాళ్ళకు జోడి కుదిరింది..

Nani : టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని సినిమాల లైనప్ చూస్తే ఎవరికైన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకుంటాడు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒక మూవీ సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. మరో మూవీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వినిపిస్తుంది. ఓ క్రేజీ ప్రాజెక్టు లో నటించనున్నాడు.. ఇంతకీ ఆ మూవీ డైరెక్టర్ ఎవరో? సినిమా ఎప్పుడు స్టార్ అవుతుంది? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


హీరో నాని ప్రస్తుతం డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్నాడు. అదే సమయంలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలతో ది ప్యారడైజ్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు.. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తితో ఓ మూవీ చెయ్యాల్సి ఉంది.. ఇప్పటికే పలు టాలెంటెడ్ డైరెక్టర్లతో పనిచేసిన నాని, ఎప్పటి నుంచో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కంబో ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళుతుందని నాని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.. గతంలో వీరిద్దరి కాంబో లో అవి రాబోతుందని వార్తలు వినిపించాయి అయితే కథ సెట్ అవ్వక ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది ఇప్పుడు మరోసారి ఈ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తే నాని ఖాతాలో మరో హిట్ సినిమా పడటం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇప్పటివరకు నాని ఎన్నో కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చేసినా, బలమైన కంటెంట్ ఉన్న దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా వంటి సినిమాలు బలమైన కథ, ఎమోషన్స్‌తో పాటు మంచి మేకింగ్స్టయిల్ కూడా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. నాని, శేఖర్ కమ్ముల కాంబో వస్తే, ప్రేక్షకులకు ఓ న్యాచురల్ మాస్టర్‌పీస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగార్జున ధనుష్తో కుబేర సినిమాని తెరికెక్కిస్తున్నారు.. సినిమా తర్వాత నాని కోసం కథ రాయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల గతంలో నాగచైతన్యతో లవ్ స్టోరీ సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు కుబేర సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. కుబేర పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. కమ్ముల ఆ తరువాత సినిమా కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. నాని కూడా పారడైస్, హిట్ 3 సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్నాయి.. ఇక శేఖర్ కమ్ముల నాని కాంబినేషన్లో సినిమా కుదిరితే మరో బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడం ఖాయమని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×