Nayanthara: హీరోహీరోయిన్ల పర్సనల్ లైఫ్‌పై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఒక హీరో, హీరోయిన్ సన్నిహితంగా కనిపించారంటే వారు రిలేషన్‌లో ఉన్నారని అందరూ ఫిక్స్ అయిపోతారు. చాలావరకు ప్రేక్షకుల అనుమానాలే నిజమవుతాయి. అలా సీనియర్ హీరోయిన్ నయనతార లైఫ్‌లో కూడా పలు రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి బయటపడినా కూడా నయన్ మాత్రం నేరుగా వీటిపై ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా తన పర్సనల్ లైఫ్‌పై ఒక డాక్యుమెంటరీ తెరకెక్కినా కూడా అందులో తను గతంలో ప్రేమించిన వ్యక్తుల పేర్లు మాత్రం చెప్పలేదు నయన్. అలాంటిది తను శింబును క్షమించేసి ఒక వేడుకలో తనను కలవడానికి సిద్ధమయ్యిందని సమాచారం.
ఆ ఫోటోల వల్లే
శింబు (Simbu), నయనతార (Nayanthara) కలిసి ‘వల్లభ’ అనే సినిమాలో నటించారు. అదే సమయంలో వారి మధ్య ప్రేమ మొదలయ్యింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. అవి రూమర్స్ అంటూ ఎప్పుడూ కొట్టిపారేయలేదు కూడా. అలా అందరి ముందు సంతోషంగా తిరుగుతున్న ఈ జంటను చూసి పెళ్లి చేసుకుంటారని అనుకున్నారంతా. కానీ ఒక్కసారిగా అంతా మారిపోయింది. శింబు, నయనతార పర్సనల్ టైమ్‌లో దిగిన ఫోటోలు లీక్ అయ్యాయి. దాని వల్ల వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా ఆ ఫోటోల వల్ల వాళ్లిద్దరికీ బ్రేకప్ కూడా అయ్యింది. అప్పటినుండి ఇద్దరూ బద్ద శత్రువులు అయిపోయారు.
అంతా అబద్ధమే
పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను వేర్వేరుగా చూడాలనే ఉద్దేశ్యంతో బ్రేకప్ అయిన చాలాకాలం తర్వాత మరోసారి కలిసి నటించారు శింబు, నయనతార. 2016లో వీళ్లిద్దరూ కలిసి ఒక సినిమా చేశారు. దానిని కలిసి ప్రమోట్ చేశారు. దీంతో శింబు, నయన్ మధ్య మనస్పర్థలు తొలగిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదనే విషయం కొన్నాళ్లకే ప్రేక్షకులకు అర్థమయ్యింది. మళ్లీ వీరిద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. పొరపాటున ఏదైనా ఈవెంట్స్‌లో కలిసినా కనీసం పలకరించుకోవడం లేదు. అలాంటిది ఒక సినిమా కోసం ఒక మెట్టు దిగి మరీ శింబుతో కలిసి చీఫ్ గెస్ట్‌గా హాజరవ్వడానికి సిద్ధమయ్యిందట నయన్. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది.
Also Read: ‘కేజీఎఫ్’, ‘బాహుబలి’ లాంటి సినిమాలు మేము కూడా చేయగలం.. మలయాళ నటుడి హాట్ కామెంట్స్
తొమ్మిదేళ్ల తర్వాత
ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా తెరకెక్కిన చిత్రమే ‘డ్రాగన్’ (Dragon). ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలకు సిద్ధమయ్యింది. దీనిని ప్రమోట్ చేయడం కోసం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శింబు, నయనతార చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నట్టు సమాచారం. ‘డ్రాగన్’ మూవీలో శింబు ఒక పాట పాడాడు కాబట్టి తనకు చీఫ్ గెస్ట్‌గా ఆహ్వానం అందింది. ఇక ప్రదీప్ రంగనాథన్ తరువాతి సినిమాను నయన్ నిర్మిస్తుంది కాబట్టి తను కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రానుంది. మొత్తానికి తొమ్మిదేళ్ల తర్వాత శింబు, నయనతార ఒక ఈవెంట్‌లో కలవనున్నారనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.