E-Paper
Advertisement

Hyderabad Metro Price: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయా? ఈ సమస్యలే కారణమా?

Hyderabad Metro Price: హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెరగనున్నాయా? ఈ సమస్యలే కారణమా?
Advertisement

Hyderabad Metro Price:  హైదరాబాద్‌లో మెట్రో ఛార్జీల పెంపుకు రంగం సిద్ధమయ్యిందా? మెట్రో ప్రయాణికులపై వడ్డన తప్పదా? బెంగుళూరు తరహాలో రేట్లు పెంచేందుకు ప్లాన్ చేస్తోందా? రద్దీ ఎక్కువగా ఉండడం, కొత్త ట్రైన్స్, కోచ్‌ల కొనుగోలు కోసం నిధుల అవసరమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మెట్రో ఛార్జీల పెంపు!

Advertisement

హైదరాబాద్ మెట్రో ప్రారంభించి దాదాపు ఏడేళ్లు పూర్తి అవుతోంది. ఏడేళ్లుగా ఒకే చార్జీలు ఉన్నాయి. ఐదేళ్లు పూర్తి అయిన సందర్బంగా చార్జీల పెంచాలని గత ప్రభుత్వాన్ని కోరింది ఎల్ అండ్ టి సంస్థ. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చార్జీల పెంపు ప్రతిపాదన తోసిపుచ్చింది. ఇప్పుడు ఛార్జీలు పెంచలేమని, ఎన్నికల తర్వాత చూద్దామని చెప్పి ఆ వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టింది.

తాజాగా మెట్రో ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. బెంగళూరు తరహాలోనే హైదరాబాద్ మెట్రో చార్జీలు సైతం పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును పబ్లిక్-ప్రయివేటు పార్టనర్ షిప్ పద్దతిలో నిర్మాణం చేపట్టారు. ఈ మెట్రో వ్యవస్థను నిర్మించిన ఎల్ అండ్ టీ సంస్థ, దీన్ని నడుపుతోంది.

Advertisement

మెట్రో రైలు చట్టం ఏం చెబుతోంది?

మెట్రో రైలు చట్టం ప్రకారం.. హైదరాబాద్‌ మెట్రోకు మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ) గా ఎల్ అండ్ టీ ఉంది. ఆ సంస్థకు-రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభంలో మాత్రమే మెట్రో ఛార్జీలను పెంచే అధికారం ఉంది. రేట్లను సవరించాలంటే కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీ మాత్రమే ఉంది. ఈ కమిటీని నియమించాలని గతంలో కేంద్రాన్ని కోరింది. కమిటీ వేయడం కూడా రెండేళ్ల కిందట జరిగిపోయింది.

ALSO READ: ఆలయంలో మాంసం ముద్దలు.. అసలు విషయం చెప్పేసిన పోలీసులు..

ప్రజల అవసరాల కోసం ఇప్పటికే మెట్రో విస్తరణ చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో కొత్త ట్రైన్లు, కోచ్ లు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తోంది. కాకపోతే నిధుల సమస్య అడ్డంకిగా మారింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కోరింది. చార్జీల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో రెడ్ లైన్, గ్రీన్ లైన్, బ్లూ లైన్లల్లో 57 స్టేషన్లలో సేవలు అందిస్తోంది మెట్రో. మినిమన్ 10 రూపాయల నుండి మాక్సిమమ్ 60 రూపాయల వరకు ప్రస్తుతం ఛార్జీలు అందుబాటులో ఉన్నాయి.  బెంగళూరు మెట్రో తరహాలో రేట్లు పెంచేందుకు నిర్వహణ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బెంగుళూరు మెట్రో దాదాపు 50 శాతం పైగా రేట్లు పెంచింది.

హైదరాబాద్ మెట్రో చార్జీలు 30 నుండి 40 శాతం వరకు పెంచాలని ఆ సంస్థ కోరనున్నట్లు సమాచారం. చార్జీల పెంపు అంశంపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోంది. ఒకవేళ పెంచితే ఈ స్థాయిలో ఛార్జీలు పెంచుతుందనేది ఆసక్తికరంగా మారింది.  ఎల్ అండ్ టీ మాత్రం బెంగుళూరు మాదిరిగా పెంచాలని డిమాండ్ చేస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ విషయాన్ని కొద్దిరోజులు పెండింగ్‌లో పెడుతోందా? రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనేది చూడాలి.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×