SVSC Poola Kundi Scene : రీసెంట్ గా మొదలైంది రీ రిలీజ్ ట్రెండ్. రీ రిలీజ్ సినిమాకు తెలుగు సినిమా బానిసలు బ్రహ్మరథం పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికి కొత్త సినిమాలు కంటే కూడా రీ రీలీజ్ సినిమాలు కి ఎక్కువ ఆదరణ లభిస్తుంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్నో రీ రిలీజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించాయి. ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలు రిలీజ్ అయినప్పటి కంటే రీ రిలీజ్ లోనే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేశాయి. ప్రతి హీరో పుట్టినరోజు సందర్భంగా, స్పెషల్ డేస్ సందర్భంగా ఎన్నో అద్భుతమైన సినిమాలను రీ రిలీజ్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నేడు మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు అన్నప్పుడు చాలామంది అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూశారు. కానీ వారందరికీ ఇప్పుడు నిరుత్సాహం ఎదురైంది. ఇంతకు అసలు కారణమేమిటంటే సినిమా ధియేటర్ లోనికి పూల కుండీలను థియేటర్ యాజమాన్యం అనుమతించలేదు. ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో సోషల్ మీడియా వేదికల్లో పూల కుండీ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. తెలుగు సినిమా బానిసల అభిమానానికి అంతులేకుండా పోయింది. ఒకవేళ పూల కుండీలను థియేటర్లోకి అనుమతిస్తే అప్పర్ బాల్కనీ నుంచి తంతే లోవర్ బాల్కనీలో పడి చాలామంది ప్రేక్షకులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకోసమే థియేటర్ యాజమాన్యం దీనిని ఎంకరేజ్ చేయలేదు కావచ్చు.
ఇదివరకే చాలా రీ రిలీజ్ లో ఆడియన్స్ ఎంత రచ్చ చేశారో అందరికీ తెలిసిన విషయమే. వెంకీ సినిమా రిలీజ్ అయినప్పుడు తబలాతో వచ్చారు. ఇంద్ర సినిమా రిలీజ్ అయినప్పుడు ఘల్లు ఘల్లుమనే పాటలో వాటర్ ఎఫెక్ట్ కోసం వాటర్ బాటిల్స్ ను వాడుతూ థియేటర్లో తడిపారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో ఏరా ఆ పూల కుండీ ఎందుకు తన్నావ్ అనే సీన్ ఎంత పెద్ద ఎమోషన్ ను బిల్డ్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే సీన్ రీ క్రియేట్ చేయడానికి పాపం సీతమ్మ వాకిట్లో అభిమానులకు అవకాశం లేకుండా పోయింది.
ఇప్పటివరకు ఒక్కడు, పోకిరి, బిజినెస్ మేన్, దూకుడు వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రీ రిలీజ్ అయి కూడా మంచి రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా 7g బృందావన కాలనీ, ఆరెంజ్, ఓయ్, బొమ్మరిల్లు, సూర్య సన్నాఫ్ కృష్ణన్ వంటి సినిమాలకు విపరీతమైన ఆదరణ లభించింది. కలెక్షన్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. ఇక ఎంతోమంది ప్రేక్షకుల డిమాండ్ మేరకు రిలీజ్ చేసిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత మేరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందో వేచి చూడాలి. అప్పట్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది.
Also Read: Kiran Abbavaram : ఏంటన్నా.. కాపురాల్లో చిచ్చుపెట్టేస్తున్నావే.. హీరోపై నెటిజన్స్ ట్రోల్స్…