BigTV English

Human Hair Theft : బంగారం లాగా విలువైనది.. రూ.కోటి విలువైన జుట్టు దొంగతనం!

Human Hair Theft : బంగారం లాగా విలువైనది.. రూ.కోటి విలువైన జుట్టు దొంగతనం!

Human Hair Theft | ఎక్కడైనా బంగారం, వజ్రాలు, ఆభరణాలు లేదా నగదు దోచుకునే దొంగలు చూసి ఉంటారు. ఇలాంటి ఘటనలు ప్రతి చోటా జరుగుతూ ఉంటాయి. కానీ విచిత్ర ఘటనలో కొందరు దొంగలు తమ చోరకళలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు. బంగారాన్ని దోచుకుంటే దానిని నగదుగా మార్చుకోవచ్చు, లేదా నగదును దోచుకుంటే నేరుగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు కొందరు దొంగలు మానవ జుట్టుని టార్గెట్ చేశారు. జుట్టుపై అంటే వ్యక్తుల తలపై ఉన్న జుట్టు కాదు, కత్తిరించిన జుట్టు మీద దృష్టి పెట్టారు.


మొక్కు రూపంలోనో లేదా ఇతర కారణాల వల్ల కత్తిరించిన జుట్టును కొందరు కొనుగోలు చేసి దాంతో విగ్గులు తయారీ చేస్తారు. దీనికి మార్కెట్లో మాంచి డిమాండ్ ఉంది. అలా వేర్వేలు ప్రాంతాల నుంచి సేకరించిన జుట్టుని వ్యాపారులు కొనుగోలు చేసి తమ గోడౌన్ లలో నిలువ చేస్తారు. ఆ తరువాత వాటిని అవసరమున్న ప్రాంతానికి తరలించి విక్రయిస్తారు. ముఖ్యంగా భారత జుట్టుకు చైనాలో భలే గిరాకీ. ఈ నేపథ్యంలో జుట్టును విక్రయించే ఒక హోల్ సేల్ వ్యాపారి తన గోడౌన్‌లో సేకరించిన జుట్టును భద్రపరిచాడు.

ఈ జుట్టును దొంగలు దోచుకుని ఎత్తుకుపోయారు. కిలోల కొద్దీ జుట్టును దొంగలు దోచుకునే ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. దాదాపు రూ.90 లక్షల నుంచి రూ.1 కోటి విలువైన జుట్టును దొంగలు దోచుకున్నారు. ఈ వార్త తెలిసి గోడౌన్ యజమాని షాక్ కు గురయ్యాడు. ఈ జుట్టు దోపిడీ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చోరీ విషయం తెలిసిన పోలీసులు భారతీయ న్యాయసంహిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Also Read: భారీ బంగారం స్మగ్లింగ్ కేసు.. కన్నడ నటి వెనుక రాజకీయ నాయకుడు

పరిచయస్తులపైనే అనుమానం
కోటి విలువైన సరుకు ఉందన్న సమాచారం తెలిసిన దొంగలే ఈ చోరీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చైనా నుంచి వచ్చిన ఒక వ్యాపారి ఈ జుట్టును సరిచూసుకుని మార్కింగ్ వేసి వెళ్లాడని యజమాని వెంకటస్వామి పోలీసులకు చెప్పారు. ఫిబ్రవరి 28న అర్ధరాత్రి పెద్ద కారులో వచ్చిన ఆరుగురు దొంగలు తమతో తెచ్చుకున్న ఇనుపరాళ్లతో గోడౌన్ షట్టర్‌ను పగలకొట్టి తెరచి, 27 సంచులను ఒక్కొక్కటిగా ఎత్తుకెళ్లడం ప్రారంభించారు. ఈ దృశ్యాన్ని సమీపంలోని ఒక వ్యక్తి గమనించగా, ‘‘ఈ సరుకు మాదే, వేరే చోటుకు తరలిస్తున్నాం’’ అని దొంగలు తెలుగులో అనుమానం రాని రీతిలో చెప్పారని పోలీసులు తెలిపారు. హడావిడిగా కారులోకి సరుకు ఎక్కించడం, జుట్టు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటం గమనించిన మరో వ్యక్తి వెంటనే హెల్ప్‌లైన్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ, దొంగలు ఇంతలో ఉడాయించారు.

లక్ష్మీపుర క్రాస్ ప్రాంతంలో కేశాల వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. ఈ సరుకు విషయం తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్రాష్ట్ర కేశాల వ్యాపారంలో ఉన్న వ్యక్తుల హస్తం ఈ చోరీలో ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఎంత జుట్టు దోచుకుపోయారు?
ఉత్తర బెంగళూరు ప్రాంతానికి చెందిన 73 ఏళ్ల కె.వెంకటస్వామి అనే వ్యాపారి తన గోడౌన్‌ను హెబ్బళ్ ప్రాంతం నుంచి లక్ష్మీపుర క్రాస్‌కు ఫిబ్రవరి 12న మార్చారు. ఇతను కేశాల వ్యాపారంలో ఉన్నాడు. కడప, శ్రీకాకుళం వంటి ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఊరూరు తిరిగి జనం దగ్గర నుంచి జుట్టును కొందరు వ్యక్తులు డబ్బులకు సేకరించి, ఏజెంట్లకు విక్రయిస్తారు. ఆ ఏజెంట్లు ఈ జుట్టును వెంకటస్వామి వంటి వ్యాపారులకు అమ్ముతారు. అలా తన వద్దకు వచ్చిన జుట్టును వెంకటస్వామి హైదరాబాద్‌లోని ఒక వ్యాపారికి విక్రయిస్తారు. ఆ వ్యాపారి దానిని బర్మాకు ఎగుమతి చేస్తారు. అక్కడ నుంచి అది చైనాకు చేరుకుంటుంది. చైనాలో ఈ జుట్టుతో అత్యంత నాణ్యమైన విగ్గులను తయారు చేస్తారు. భారతీయుల జుట్టుతో తయారైన విగ్గులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అంత విలువైన 850 కేజీల జుట్టును ఏజెంట్ల నుంచి కొనుగోలు చేసి వెంకటస్వామి తన గోడౌన్‌లో 27 సంచుల్లో భద్రపరిచారు. ఆ 850 కేజీల జుట్టును దొంగలు ఎత్తుకెళ్లారు.

Related News

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Tariff War: 50శాతం సుంకాలపై భారత్ ఆగ్రహం.. అమెరికాను మనం నిలువరించగలమా?

Indian Army Upgrades: పాక్‌కు ముచ్చెమటలు పట్టించే నిర్ణయం తీసుకున్న కేంద్రం.. ఏకంగా రూ.67 వేల కోట్లతో…

Uttarkashi Cloudburst: ఉత్తరకాశీ విషాదం.. 28 మంది కేరళా టూరిస్టులు గల్లంతు.. పెరుగుతోన్న మరణాల సంఖ్య

Big Stories

×