BigTV English

Weekend Theatre and OTT Movies : ఈ వారం థియేటర్, ఓటీటీల్లోకి సినిమాలు.. తమన్నా, రాశీఖన్నాల అందాల ఆరబోత

Weekend Theatre and OTT Movies : ఈ వారం థియేటర్, ఓటీటీల్లోకి సినిమాలు.. తమన్నా, రాశీఖన్నాల అందాల ఆరబోత

June Third Week Theatre and OTT Movies : ప్రతివారం థియేటర్, ఓటీటీల్లోకి ఏయే సినిమాలు వస్తాయా ? ఏవేం వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతాయా అని.. సినీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. థియేటర్లో సినిమాకెళ్లాలంటే ఖర్చెక్కువ. అందుకే ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం తెగ వెతికేస్తుంటారు. ఈ వారం కూడా థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతున్నాయి. ఇంకెందుకు లేటు. ఈ వీకెండ్ కు ఈ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ.. ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి రెడీ అవ్వండి.


థియేటర్లలో ఈ వీకెండ్ చిన్నసినిమాలదే హవా. మూడు సినిమాలు జూన్ 21న విడుదలకు రెడీ అవుతున్నాయి. వాటిలో ఒకటి నింద – ఎ కాండ్రకోట మిస్టరీ. రాజేశ్ జగన్నాథం డైరెక్షన్లో.. వరుణ్ సందేశ్ హీరోగా వస్తున్న సినిమా నింద. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాలో.. తనికెళ్ల భరణి, అనీ, సూర్యకుమార్, భద్రం కీలక పాత్రలు పోషించారు. కాండ్రకోటలో జరిగిన మిస్టరీ ఏంటి ? అందుకు కారణమెవరన్న కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా జూన్ 21న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఇక జూన్ 21నే విడుదలవుతున్న మరో సినిమా OMG. ఓ మంచి గోస్ట్ అనేది దాని ట్యాగ్ లైన్. చారి 111 తో అలరించిన వెన్నెల కిషోర్.. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో శ్వేతా నందిత హీరోయిన్ గా.. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించిన OMG థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ వర్క్స్ చేస్తోంది.


ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న మరో సినిమా హనీమూన్ ఎక్స్ ప్రెస్. నటుడు చైతన్యరావు, హెబ్బాపటేల్ జంటగా.. బాలరాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో తనికెళ్ల భరణి, సూహాసిని కీలక పాత్రలు పోషించారు.

ఓటీటీల్లో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు

నెట్ ఫ్లిక్స్

కోటా ఫ్యాక్టరీ (3) (జూన్ 21)

హాలీవుడ్ – అవుట్ స్టాండింగ్ (జూన్ 18), ట్రిగర్ వార్నింగ్ (జూన్ 21)

ఏజెంట్ ఆఫ్ మిస్టరీ (జూన్ 18)

మహరాజ్ (హిందీ సిరీస్) – (జూన్ 19)

నడిగర్ (మలయాళం) – (జూన్ 21)

డిస్నీ +హాట్ స్టార్

బ్యాడ్ కాప్ (హిందీ) – (జూన్ 21)

జియో సినిమా

ది హోల్డోవర్స్ – (జూన్ 16)
హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 2 వెబ్ సిరీస్ (జూన్ 17)
ఇండస్ట్రీ వెబ్ సిరీస్ (జూన్ 19)

థియేటర్లో విడుదలై.. మంచి టాక్ తెచ్చుకున్న సినిమా బాక్. సుందర్ సి. ప్రధానపాత్రలో.. తమన్నా, రాశీఖన్నా హీరోయిన్లుగా వచ్చిన సినిమా బాక్. మే 3న థియేటర్లలో విడుదలై.. సక్సెస్ అయిన ఈ సినిమా డిస్నీ +హాట్ స్టార్ లో జూన్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్నాయి.

 

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×