BigTV English

SL vs NED T20 World Cup 2024 Highlights: నామమాత్రపు మ్యాచ్ లో.. ఘనంగా గెలిచిన శ్రీలంక

SL vs NED T20 World Cup 2024 Highlights: నామమాత్రపు మ్యాచ్ లో.. ఘనంగా గెలిచిన శ్రీలంక

Sri Lanka vs Netherlands Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్ లు ఈరోజుతో ముగియనున్నాయి. ఈ క్రమంలో నెదర్లాండ్స్ తో జరిగిన నామమాత్రపు మ్యాచ్ లో శ్రీలంక చెలరేగి ఆడింది. 83 రన్స్ తో విజయభేరి మోగించింది. కొంచెం ఊపిరి తీసుకుని స్వదేశానికి బయలుదేరింది.


టాస్ గెలిచిన నెదర్లాండ్స్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 16.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 83 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయం సాధించింది.

202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ కి ఓపెనర్లు కాసేపు ఆడారు. అలా 4.3 ఓవర్లలో 45 పరుగులు చేశారు. ఈ దశలో మ్యాక్స్ డొనాల్డ్ (11) అవుట్ అయ్యాడు. తర్వాత ఇద్దరు మాత్రమే నిలకడగా ఆడారు. ఒకరు ఓపెనర్ మిచెల్ లివిట్ (31), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (31) చేశారు. అనంతరం సైబ్రాండ్ (11) అవుట్ అయిపోయాడు. తర్వాత ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. మొత్తానికి 16.4 ఓవర్లలో 118 పరుగులకి ఆలౌట్ అయిపోయింది.


శ్రీలంక బౌలింగులో తుషార 3, మహీష్ తీక్షణ 1, కెప్టెన్ హసరంగ 2, దాసన్ శనక 1, పతిరణ 2 వికెట్లు పడగొట్టారు.

Also Read: గౌతం గంభీర్ టీమ్ ఇండియా కోచ్.. ఇది ఫిక్స్ !

అంతకుముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక కి కూడా శుభారంభం దక్కలేదు. ఓపెనర్ నిస్సాంక డక్ అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ మాత్రం 29 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో ధనాధన్ 46 పరుగులు చేశాడు. కుమింద్ మెండిస్ (17) అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ధనంజయ డిసిల్వా (34) చేశాడు. అసలంక మాత్రం తుక్కు రేగ్గొట్టాడు. 21 బంతుల్లో 5 సిక్స్ లు, 1 ఫోర్ సాయంతో 46 పరుగులు చేశాడు. తర్వాత ఏంజిలో మాథ్యూస్ (30), కెప్టెన్ హసరంగ (20 నాటౌట్) చేయడంతో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ ముందు ఉంచింది.

ఐర్లాండ్ బౌలింగులో వివియన్ 1, ఆర్యన్ దత్ 1, లోగన్ 2, పాల్ వాన్ 1, టిమ్ ప్రింగిల్ 1 వికెట్ పడగొట్టారు.

Related News

Babar Azam : 712 రోజులు అయింది.. కానీ మాత్రం ఒక్క సెంచరీ చేయలేకపోయాడు… అత్యంత ప్రమాదంలో బాబర్

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Big Stories

×